అమెరికాలో అదరగొట్టిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘

స్వీటీ అనుష్క శెట్టి.. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘. యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ బాబు.పి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా సెప్టెంబర్ 7న ఆడియన్స్ ముందుకొచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘కి తొలుత మిశ్రమ స్పందన వచ్చినా ఆ తర్వాత బాగా పికప్ అయ్యింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ చిత్రాన్ని అమెరికాలో బాగా ప్రమోట్ చేశాడు హీరో నవీన్ పోలిశెట్టి. ఆ ప్రభావం కూడా కలిసి యు.ఎస్. లో ఏకంగా 1.825 మిలియన్ల డాలర్స్ ను కొల్లగొట్టింది. ఒక సినిమా విడుదలైన మూడు, నాలుగు వారాల్లోనే ఓటీటీ లలోకి వచ్చేస్తున్న ఇలాంటి తరుణంలో ఈ రేంజ్ కలెక్షన్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు.

మరోవైపు ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ ఓటీటీ స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది. ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

Related Posts