అల్లు అరవింద్, దిల్ రాజు ను కలిపిన ఎన్టీఆర్

అల్లు అరవింద్, దిల్ రాజు లను కలిపాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వీళ్లు ఎప్పుడు విడిపోయారో తెలుసు కదా..? కొన్నాళ్ల క్రితం విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిప్పుడు రచ్చ స్టార్ట్ అయింది.

నిజానికి పరశురామ్ అంతకు ముందే అల్లు అరవింద్ దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఉన్నాడు. లెక్క ప్రకారం ముందుగా ఆయనకే సినిమా చేయాలి. బట్ మధ్యలో ఎంటర్ అయిన దిల్ రాజు బ్యానర్ లో విజయ్ తో సినిమా ప్రకటించాడు. ఈ విషయంలో అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి పరశురామ్ తో పాటు దిల్ రాజుపై విరుచుకు పడాలని చూశాడు. బట్ కొంతమంది పెద్దలు ఎంటర్ అయ్యి ప్రెస్ మీట్ ఆపించారు. కానీ అల్లు అరవింద్ మాత్రం తన అడ్వాన్స్ ను వడ్డీతో కలిపి ఇవ్వాల్సిందే అని పరశురామ్ ను డిమాండ్ చేశాడు.

దిల్ రాజు ఈ అమౌంట్ ను సెటిల్ చేశాడు. దీంతో తన దర్శకుడుని లాక్కోవడమే కాక.. ఇలా అవమానిస్తారా అని కోపంతో దిల్ రాజు నంబర్ బ్లాక్ చేశాడు అల్లు అరవింద్.అటు దిల్ రాజు కూడా ఆల్రెడీ అనౌన్స్ అయిన ప్రాజెక్ట్ ను ఆపాలని చూడ్డమే కాక.. తన దర్శకుడిని ఇబ్బంది పెడతాడా అంటూ తనూ బ్లాక్ చేశాడు. అప్పటి నుంచీ వీరి మధ్య మాటలు లేవు.

అలాంటి ఇద్దరినీ ఒకే వేదికపై తీసుకువచ్చిన షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునేలా చేశాడు ఎన్టీఆర్. పైగా ఆ వేదికపై తను లేకుండానే ఈ ఇద్దరినీ కలిపాడు యంగ్ టైగర్. అయితే దీని వెనక ఆసక్తికరమైన అంశాలున్నాయి.


ఎన్టీఆర్ సొంత బావమరిది(ప్రణతి తమ్ముడు) నార్నే నితిన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. అది కూడా గీతా ఆర్ట్స్2 బ్యానర్ నుంచి.

లేటెస్ట్ గా ఈ మూవీ ఓపెనింగ్ జరిగింది. ఈ ఓపెనింగ్ కు దిల్ రాజును కూడా ఇన్వైట్ చేశాడు ఎన్టీఆర్.

కానీ అక్కడికి అల్లు అరవింద్ వస్తాడు కదా..అయినా ఇద్దరి మధ్య సమన్వయం చేసి గొడవల్లేకుండా కలిసిపోయేలా మాట్లాడాడు ఎన్టీఆర్. అందుకే ఎప్పుడో నంబర్స్ కూడా బ్లాక్ చేసుకున్న ఈ ఇద్దరూ మళ్లీ కలిసిపోయిన ఆనందంగా చేతులు కలుపుకున్నారు.

నిజానికి వీళ్లు ఇప్పుడప్పుడే కలుస్తారు అని ఆ టైమ్ లో వీరి గొడవ చూసిన ఎవరూ అనుకోరు. బట్.. ఇంత సింపుల్ గా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారంటే అందుకు మరో కారణం కూడా ఉంది.


ఈ నెల 30 తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షకుడుగా పోటీ చేస్తున్నాడు దిల్ రాజు. ఇప్పుడు అల్లు అరవింద్ లాంటి నిర్మాతతో ఇష్యూస్ పెట్టుకుంటే.. లేదా పాత ఇష్యూస్ ను అలాగే ఉంచితే అది ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది. తన ఓటమికి కారణం అవుతుంది.

అదే టైమ్ లో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో చెప్పినా వినకపోతే మరో సమస్య వస్తుంది. సో.. ఇప్పుడు ఈ మూవీ ఓపెనింగ్ కు రావడం వల్ల ఛాంబర్ ఎలెక్షన్స్ లో తనకు ఎన్టీఆర్ వర్గంతో పాటు అల్లు అరవింద్ వర్గం నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. అందుకే అతనూ కామ్ గా వచ్చేశాడు. ఏదేమైనా సినిమా పరిశ్రమలో అయితే యాపారం.. లేదంటే రాజకీయమే ప్రధానాంశంగా ఉంటుందని మరోసారి రుజువయింది.

Related Posts