ప్రీమియర్స్ హడావుడి మొదలుపెట్టిన ‘ప్రేమలు’

మార్చి 8 మహాశివరాత్రి.. బాక్సాఫీస్‌ రేస్‌లో చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి. పెద్ద పెద్ద సినిమాలున్నాయి. వీటితో పోటీ పడబోతుంది ఓ చిన్న సినిమా. అది కూడా డబ్బింగ్ వెర్షన్. అదే ‘ప్రేమలు’ . ప్రత్యేకత ఏంటంటే.. ఈ సినిమాను తెలుగు వెర్షన్ అందించేది ఎస్‌ఎస్‌ రాజమౌళి కొడుకు కార్తికేయ.
పెద్ద పెద్ద సినిమాలు, క్రేజీ, స్టార్ క్యాస్టింగ్ ఎక్కువ ఉన్న సినిమాలు రిలీజ్‌ కానుండంతో మార్చి 7 న ‘ప్రేమలు’ సినిమా ప్రీమియర్స్‌ ప్లే చేయబోతున్నారు.

ఏఏంబి, AAA, ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఆల్‌రెడీ బుకింగ్స్ స్టార్ట్‌ అయ్యాయి. మేజర్‌ టు బేబీ.. ఈ ప్రీమియర్స్ మంత్రం బాగా పనిచేసింది. మళయాళంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం కావడంతో కంటెంట్ పై నమ్మకంతో రిలీజ్‌ చేస్తున్నారు. యూత్‌ టార్గెట్ సినిమా కావడంతో మినిమమ్‌ గ్యారెంటీ పక్కా.


బిజినెస్ పరంగా తక్కువ పెట్టుబడి కాబట్టి టాక్ పాజిటివ్ గా వస్తే వసూళ్ల రూపంలో యూతే తిరిగి ఇచ్చేస్తారు. కాకపోతే ఆ స్థాయిలో కనెక్ట్ అవ్వాలి మరి. మంచి ట్రెండీ కంటెంట్ తో రూపొందిన ప్రేమలు హీరో హీరోయిన్లు ఆల్రెడీ భాగ్యనగరంలోనే మకాం వేసి ఇంటర్వ్యూలు గట్రా తెగ ఇచ్చేస్తున్నారు

Related Posts