టాలీవుడ్

ఖైదీ పాత్రలో అదరగొడుతోన్న అజిత్

తమిళ అగ్ర కథానాయకులు తెలుగు నిర్మాతలతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ లిస్టులో ఇప్పటికే దళపతి విజయ్.. దిల్‌రాజు నిర్మాణంలో ‘వారసుడు’ సినిమా చేశాడు. ఇప్పుడు తమిళ తల అజిత్.. మరో తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ లో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా చేస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా సెకండ్ లుక్ రిలీజయ్యింది. ఈ పోస్టర్ లో ఖైదీ గెటప్ లో ఉన్నాడు అజిత్. ఇక.. ఈ పోస్టర్ రిలీజైన 24 గంటల్లోనే 62 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. ఇదొక రేర్ రికార్డ్. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

మరోవైపు.. అజిత్ నటిస్తున్న ‘విదా ముయార్చి’ విడుదలకు ముస్తాబవుతోంది. అక్టోబర్ 31న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తోంది. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీని మగిళ్ తిరుమేని తెరకెక్కిస్తున్నాడు.

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో అజిత్‌ కి జోడీగా త్రిష నటిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో అర్జున్ సర్జా, రెజీనా, ఆరవ్ కనిపించబోతున్నారు. అనిరుధ్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు.

Telugu70mm

Recent Posts

కొత్త సినిమా ప్రారంభించిన బెల్లంకొండ

ప్రస్తుతం బాలీవుడ్ ఆశలు పక్కనపెట్టేసిన బెల్లంకొండ శ్రీనివాస్.. తెలుగు మార్కెట్ పై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈకోవలోనే 'టైసన్…

29 mins ago

Hebah Patel

35 mins ago

టాలీవుడ్ 2024.. ఫస్ట్ హాఫ్ రిపోర్ట్

ఈ ఏడాది అప్పుడే క్యాలెండర్ లో ఆరు నెలలు గిర్రున తిరిగాయి. టాలీవుడ్-2024 లో ఫస్ట్ హాఫ్ పూర్తయ్యింది. మరి..…

2 hours ago

హీరోలను ఎలివేట్ చేయాలంటే మనోళ్లే

హిందీ చిత్ర పరిశ్రమ అంటేనే భారతీయ సినిమా మొత్తాన్ని ప్రతిబింబించే పరిశ్రమగా గుర్తింపు ఉంది. బాలీవుడ్ లో పనిచేసే నటీనటులు,…

4 hours ago

Venkatesh-Anil Ravipudi film ready for Muhurtam

Victory Venkatesh and blockbuster director Anil Ravipudi's combination film was announced a few days ago.…

4 hours ago

Prabhas is the king of collections in North America

North America is the major overseas market area for the Telugu film industry. As it…

4 hours ago