టాలీవుడ్

నవంబర్ కి షిప్టైన అజయ్ దేవగణ్ ‘సింగమ్ అగైన్‘

బాలీవుడ్ లో యాక్షన్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ రోహిత్ శెట్టి. తన సినిమాల్లో యాక్షన్ ను ఏ రేంజులో చూపిస్తాడో.. కామెడీని కూడా అంతే స్థాయిలో అదరగొడుతుంటాడు. రోహిత్ శెట్టి బాలీవుడ్ లో ఓ కాప్ యూనివర్శ్ నే సృష్టించాడు. ‘సింగమ్, సింగర్ రిటర్న్స్, సింబ, సూర్యవంశి‘ వంటి చిత్రాలు ఈ యూనివర్శ్ లో పోలీస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చి మంచి విజయాలు సాధించాయి. ఈకోవలోనే ఇప్పుడు తన ‘సింగమ్‘ సిరీస్ లో ‘సింగమ్ అగైన్‘ మూవీని తీసుకొస్తున్నాడు.

సూర్య నటించిన ‘సింగమ్‘ రీమేక్ గా అజయ్ దేవగణ్ ‘సింగమ్‘ తెరకెక్కింది. అయితే.. ‘సింగమ్ రిటర్న్స్‘ మాత్రం తన సొంత కథతోనే రూపొందించాడు రోహిత్ శెట్టి. ఇప్పుడు కూడా ఓన్ స్టోరీతో ‘సింగమ్ అగైన్‘ మూవీని తీసుకొస్తున్నాడు. ఈ మూవీలో బాజీరావ్ సింగమ్ గా టైటిల్ రోల్ లో అజయ్ దేవగణ్ కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో మరో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో దీపిక పదుకొనె నటిస్తుంది.

ఇంకా.. టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్ వంటి వారు ఈ మూవీలో కనిపించబోతున్నారు. అలాగే.. రోహిత్ శెట్టి కాప్ యూనివర్శ్ లో భాగమైన అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్ కూడా ‘సింగమ్ అగైన్‘ కోసం అథితి పాత్రల్లో అలరించనున్నారు. అసలు ఆగస్టు 15న విడుదల తేదీ ఖరారు చేసుకున్న ‘సింగమ్ అగైన్‘.. ఇప్పుడు వాయిదా పడింది. నవంబర్ 1న దీపావళి కానుకగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.

Telugu 70mm

Recent Posts

Kajal Aggarwal

4 hours ago

‘Mr Bachchan’ beauty is getting busy

Some stars are offered successive opportunities even before the release of their first film. Pune…

7 hours ago

‘Devara’ pre-release business on a massive scale

'Devara' business figures have come out in Telugu states. It seems that this movie has…

7 hours ago

Amala Paul gave birth to a Baby Boy

Actress Amala Paul gave birth to a baby boy. Amala Paul said on social media…

7 hours ago