నా అభిమానుల తర్వాతే నిర్మాతలు, దర్శకులు – చిరంజీవి

అమ్మ ప్రేమ మనకు ఏనాటికీ మనకు పాతది కాదు. బోర్ కొట్టదు. అలాగే అభిమానులు చూపించే ప్రేమ, ఈ కేకలు, కేరింతలు కూడా ఎప్పుడు విన్నా ఫ్రెష్ గా ఉంటుంది. ఎప్పుడు చెవిన పడ్డా హృదయాన్ని టచ్ చేస్తుంది. ఇది చాలాసార్లు అన్నమాటే కానీ.. మళ్లీ మళ్లీ అంటున్నాను. మీరు చూపించే ఈ ప్రేమాభిమానాలు చూస్తే ఇంక చాలదా అనిపిస్తుంది. ఇంత ప్రేమ ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు. అందుకే నేను ఏం చేసినా నా అభిమానులు సంతోషించేలా, గర్వపడేలా, రొమ్ము విరుచుకునేలా, సంతోషించేలా ఉండేలా నా బిహేవియర్ ఉండాలని నా వ్యక్తిత్వాన్ని, నా మనస్తత్వాన్ని, నా నడవడికను మార్చుకుంటూ వస్తున్నాను అనేది వాస్తవం.

ఇంతమందికి ఆదర్శంగా ఉన్న నేను ఎంత బాగా ఆచితూచి అడుగులువేయాలని నేర్చుకుంటూ మీ అందరూ మా అన్నయ్య అని చెప్పుకునే స్థాయికి వచ్చాను.నాతో జర్నీ చేసే సీనియర్ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఈ రోజు టీనేజ్ బాయ్స్, గాళ్స్ రావడం చూస్తే ఆనందంగా ఉంది. బహుశా వాళ్ల అమ్మా నాన్నలు వాళ్లు రాలేక నాకోసం వారి బిడ్డలను పంపించారని భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన యుక్త వయసు ఆడబిడ్డలు, పిల్లలందరికీ థ్యాంక్స్. ఇంటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఖైదీ నెంబర్ 150లోని ఒక డైలాగ్ గుర్తొస్తుంది. నాకు నచ్చితే చేస్తాను. నాకు నచ్చితేనే చూస్తాను అనే మాటతో చూస్తే ఈ సినిమా నాకు నచ్చింది కాబట్టే చేశాను. ఇక్కడ చాలామంది రీమేక్ చేస్తున్నా అంటున్నారు. కానీ ఒక మంచి కంటెంట్ ఉన్నప్పుడు అది మనవారికీ చేరాలని ప్రయత్నం చేస్తే తప్పేంటీ.. ఇప్పుడు ఓటిటి వచ్చింది కాబట్టి అందరికీ అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి ఇది తప్పు అనిపించొచ్చు. కానీ ఈ వేదాళం సినిమా ఓటిటిలో లేదు. అదే ధైర్యంతో డైరెక్టర్ మెహర్ రమేష్‌, నిర్మాత వచ్చినప్పడు మొన్ననే నేను లూసీఫర్ రీమేక్ చేశాను మళ్లీ చేస్తే గొడవ చేస్తారేమో అన్నాను. కానీ వాళ్లు ఈ రీమేక్ ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో లేదు అని చెప్పారు. ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేశాను. ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందని ధైర్యంగా నమ్ముతున్నాను.

కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఎక్కడో కొంచెం డౌట్ ఉంటుంది.ఈ సీన్ ఎలా వస్తుంది.. తెరమీద ఎలా రక్తి కట్టిస్తుందనే డౌట్ ఉంటుంది. కానీ ఈ సినిమా షూటింగ్ కు వెళ్లిన ప్రతి రోజూ ఎంతో సరదాగా ఉండేవాణ్ని. ఎందుకంటే మా అందరి మనసుల్లో ఎందుకో ఈ సినిమా సూపర్ హిట్ అన్న ఫీలింగ్ కలిగింది. అంత భరోసా ఈ సినిమా ఇచ్చింది. కీర్తి సురేష్, తమన్నా, ఆది, గెటప్ శీను, వేణు, బిత్తిరి సత్తి, లోబో, సత్య, ఉత్తేజ్ ఇలా వీళ్లందరూ ఉంటే కళకళలాడుతూ ఎంతో ఎనర్జీగా ఉండేది. మా మెహర్ రమేష్ పని సజావుగా ఉండేది. అతని డైరీ కాస్త కన్ఫ్యూజన్ తో స్టార్ట్ అయ్యేది. కానీ నా మొహంలో నవ్వు చూసేసరికి అతని పని సులువు అవుతుంది. మెహర్ రమేష్ చిన్నప్పటి నుంచీ తెలుసు. అప్పటి నుంచీ దర్శకడు కావాలనేది తన కల. తన స్వయంకృషితో ఎదగాలనుకున్నాడు తప్ప అన్నయ్య తెలుసు, పవన్ కళ్యాణ్ తెలుసు అని ఎప్పుడూ అనుకోలేదు. మా రికమండేషన్ లేకుండా తనకంటూ అవకాశాలు అందిపుచ్చుకుని ఎదుగుతున్నాడు. మొన్న బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ స్థానం ఉంటుంది. అందుకే మా ఫ్యామిలీలో ఎవరున్నా.. మేం ప్రమోషన్ చేయం. వారిని వారు నిలబెట్టుకోవాలని చెబుతాం. అదే కళ్యాణ్ చెప్పాడు నేనూ పునరుద్ఘాటిస్తున్నాను. ఇంకా బయట యంగ్ స్టర్స్ ఎవరున్నారు.. కొత్తగా వచ్చేవారికి మన ఇమేజ్ ను అడ్డుపెట్టి సపోర్ట్ గా నిలబడదాం. బలగం వేణు కోసం అదే చేశాం. వైవా హర్ష ఏదో సినిమా చేస్తూ సపోర్ట్ చేయమంటే చేశాను. ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే వారికి చేయూత ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నాను.

పాత నెత్తురు తీసేస్తే కొత్త నెత్తురు వస్తుంది. అప్పుడు కొత్త బ్లడ్ సెల్స్ కొత్త జోష్ ఇస్తుంది. ఆ కొత్త ఉత్సాహాన్ని ఇండస్ట్రీలో నింపాలి అంటే కొత్తతరం రావాలి. వారి ఐడియాస్ తో ఇండస్ట్రీ మరింత ముందుకు వెళుతుంది. ఇది మా సీనియర్స్ నుంచి కాదు.. మీ యంగ్ స్టర్స్ నుంచే అవుతుంది. ఈ ఇండస్ట్రీలో ఎవరికైనా టాలెంట్ ఉంటే వారికి అనూహ్యమైన స్థానం ఇస్తుంది. ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చిన వారికే అది వర్తిస్తుంది. మిగతా వారు తక్కువ అని కాదు. కానీ టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలో సాధ్యం అవుతుంది. ఇక్కడ ఉన్నవారు తక్కువ చదువుకున్నా.. పెద్ద కార్లలో తిరుగుతున్నారు. ఫస్ట్ క్లాస్ విమాన ప్రయాణాలు చేస్తున్నారు. ఇండస్ట్రీ పుష్పక విమానం లాంటిది. ఎంతమంది వచ్చినా ఎంతోమందికి అవకాశం ఉంటుంది. అలాంటి కళామతల్లి సినిమా ఇండస్ట్రీ. తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రోత్సహించాలి. అలా నేనూ స్టార్స్ మాత్రమే ఉన్న ఇండస్ట్రీలోకి నేను బిక్కుబిక్కుమంటూనే ప్రవేశించాను. అయినా నాపై నాకు నమ్మకం బలంగా ఉంది. అందుకే చిన్న చిన్న వేషాలు వచ్చినా చేశాను. నా టాలెంట్ తెలిసినా.. చిన్న చిన్న వేషాలూ వేశాను. అప్పటికే కొన్ని హిట్స్ కొట్టి ఉన్న నేను కాదంటే.. ఇది సాధ్యం కాదు. కానీ ఈ ఇండస్ట్రీ నన్ను భుజాలపై పెట్టుకుని నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది ప్రేక్షకులు. ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్స్ ఎస్ చెబితేనే నిర్మాత సినిమా తీసేశాడు. ఒక డిస్ట్రిబ్యూటర్ వస్తే ఒక విఐపిలా చూసేవారు. అలాంటి వారు ఎవరో హీరోతో ఈ సినిమా చేద్దాం అంటే.. చిరంజీవి డ్యాన్సులు, ఫైట్లు నేచురల్ గా చేస్తున్నాడు అంటే అది ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం వల్లే. అలా నిర్మాతలకు నాకు అవకాశాలు ఇస్తూ నన్ను కమర్షియల్ హీరోను చేశారు. అందుకే నేను ప్రేక్షకులనే ఎక్కువగా అభిమానిస్తాను. అందుకే ఏ సినిమా చేసినా ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారు అనేదానిపైనే నా ఫోకస్ ఉంటుంది. బంగీ జంప్ చేసినా వారి కోసమే. నన్ను ఆదరించింది.. నాకు చేయూతనిచ్చింది.. నాకు ఈ స్థానం కల్పించింది ప్రేక్షకులు. ఆ తర్వాతే ఫిల్మ్ ఇండస్ట్రీ. అందుకే వారిపై నాకు కృతజ్ఞత.


ఇక ఇప్పటికీ నా గ్లామర్ గురించి మాట్లాడుతుంటారు. మొన్న మిల్కీ బ్యూటీ సాంగ్ లో ఇంత గ్లామర్ గా ఉన్నారేంటీ అంటుంటారు. ఆ గ్లామర్ ను ఎనర్జీని ఇస్తున్నది ప్రేక్షకులు, అభిమానులు. ఇది నా గుండెలోతుల్నించి వస్తున్న మాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ తరగదు. ఇంతమంది నన్ను అన్నయ్యా అంటూ ఇంతమంది రావడం.. చిరంజీవి అనే సాదాసీదా లుక్స్ తో ఉన్నవాడు ఎదిగినప్పుడు మీకూ సాధ్యమే అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఎంతోమందికి పెద్ద అవకాశాలు ఇస్తుంది. జబర్దస్త్ ఎంతో టాలెంట్ అందించింది. శ్రీ ముఖి మా ఫ్యామిలీ. నేను ఇప్పుడు శ్రీ ముఖిని ఎందుకు దగ్గరకు లాక్కున్నానో మీకు సినిమాలో తెలుస్తుంది. దర్శకుడు అన్నయ్యను గొప్పగా చూపించాలని ప్రయత్నించిన మెహర్ రమేష్ ఈ సినిమాకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. నేను గర్వించేలా నాకు మరో తమ్ముడు అనిపించుకునేలా ఈ సినిమా విజయంతో మీ ఆశిస్సులు పొందుతాడు. ఇక ఫైట్స్ కు సంబంధించి రామ్ లక్ష్మణ్ లకు నా పల్స్, మీ పల్స్ తెలుసు. వారి వర్క్ కు హ్యాట్సాఫ్. నా జేబుదొంగ నుంచీ పరిచయం వీళ్లు. వీరి ఫైట్స్ ఎక్స్ లెంట్ గా ఉన్నాయి. డివోపి డడ్లీ గురించి చెప్పాలి. తన పేరు డడ్లీ అయినా డెడ్లీగా వర్క్ చేస్తాడు. పనితనంతో పాటు వ్యక్తిత్వం తోనూ ఆకట్టుకుంటాడు. అప్పుడప్పుడూ చిన్న ఆర్టిస్టులైనా అమ్మాయిలను దగ్గరకు తీసుకుంటాడు. నేను చూడలేదు అనుకుంటున్నాడేమో. సుశాంత్.. అడగ్గానే నాకు ఆయనతో అవకాశం వచ్చింది చాలు అంటూ చిన్న సీన్స్ అయిన వచ్చాడు. తను డ్యాన్స్ వేసేటప్పుడు ఎగ్జైట్మెంట్ కు హ్యాపీనెస్ ఫీలింగ్ కనిపిస్తుంది. ఆర్ట్ డైరెక్టర్ నన్ను వీరయ్యలో బాగా చూపించాడు. ఇప్పుడు నా అభిమానిగా మరింత బాగా తన వర్క్ కనిపిస్తుంది. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందంటే ఇలాంటి టెక్నీషియన్స్ వల్లే.


ఇక తమన్నాతో ఫస్ట్ టైమ్ ఒక మాస్ కామెడీ క్యారెక్టర్ చేసింది. తనతో చేసిన గ్లామర్ సాంగ్ బాగా ఉంటుంది. ఇంక చెప్పాల్సింది మహానటి గురించి. కీర్తి సురేష్ గురించి చెప్పాలి అంటే.. ఈ రోజుల్లో అద్భుతమైన నటి ఉన్నారంటే తనే. మా ఇంట్లో బిడ్డలా అనిపించింది. అన్నా చెల్లెలుగా చేశాం. సోదరి ప్రేమ వస్తుంది. కానీ నేనే ఆపుకుంటాను. రేపు ఎప్పుడైనా హీరో హీరోయిన్ గా చేయాల్సి వస్తే ఈ ఫీలింగ్ అడ్డుపడుతుంది. అందుకే ఎవరైనా మీరిద్దరు అన్నా చెల్లెలుగా మంచి కెమిస్ట్రీ వర్కవుట్అయింది అంటే అది ఈ సినిమా వరకే ఉంచుకోండి.. అంటే నువ్వు మెహర్ రమేష్ ను అన్నయ్యా అనుకో.. నా అభిమానులు నన్ను అన్నయ్య అంటే చాలు అన్నా. ఇంత అందమైన టాలెంట్ ఉన్న అమ్మాయి అన్నయ్య అంటే ఎక్కడో కలుక్కుమంటుంది. నువ్వు నెక్ట్స్ పిక్చర్ లో హీరోయిన్ గా ఉండాలి.తను ఎంతో సరదాగా ఉంటుంది. స్వచ్ఛమైన నవ్వు. జాబిలి లాంటి నవ్వు. షూటింగ్ చేస్తున్నప్పుడు గలగల పారే నదిమీద పడవ ప్రయాణంలా ఉంటుంది. తనను మిస్ అవుతున్నా తనని అంటే నా లెవల్ కు తగ్గిపోతా అనుకుని అనలేదు. తను రెండు మూడు సార్లు అనే సరికి అంటున్నా.. ఐ మిస్ హర్ సో మచ్. ఎన్నో విషయాలు చెబుతుంది. వాళ్ల అమ్మగారు నాతో పున్నమినాగులో నటించింది.

మహానటి చూసిన తర్వాత సావిత్రి కనిపించింది. ఆ పాత్రలో గొప్పగా ట్రాన్స్ ఫామ్ అయిపోయింది. ఈ సినిమా చూసి అందరినీ ఇంటికి పిలిచి ట్రీట్ ఇచ్చాను తను రాలేదు. అప్పుడే వాళ్ల అమ్మకు ఫోన్ చేసి జాతీయ అవార్డ్ వస్తుందని చెప్పా. నా నోటి వాక్కువ ఫలించి నిజంగానే తనకు జాతీయ అవార్డ్ వచ్చింది. మా ఇద్దరి మధ్యా సీన్స్ బాగా పండాయి. అవి పండితే సినిమా బావుటుంది. ఇది తన సన్మాన సభ అయితే గంట మాట్లాడగలను. కానీ కాదు. రోజూ మా ఇంటి ఫుడ్ తిని ఎంత గ్లామర్ పెరిగిపోయిందో.


ఇక నా మ్యూజిక్ డైరెక్టర్ నా తమ్ముడు మణిశర్మ తనయుడు మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన తర్వాత కొత్తవారిని ఎంకరేజ్ చేయాలని అవకాశం ఇచ్చాను. ఇవాళ రాలేకపోయాడు. లాస్ట్ రీల్ రీమిక్స్ చేస్తున్నాడు. ఎంతో భవిష్యత్ ఉన్న కుర్రాడు. ఏ రకమైన పాటైనా బాగా ఇవ్వగలిగాడు. తండ్రికి మించిన తనయుడు అవుతాడని భావిస్తూ.. సాగర్ థ్యాంక్యూ వెరీ మచ్. మా అందరిలోనూ సీనియర్ టెక్నీషియన్ ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ గారు. ఆయనా రాలేకపోయారు. ఆయన సినిమాను ఓన్ చేసుకుని అన్ని కరెక్షన్స్ చెబుతూ మెహర్ రమేష్ కు వెన్నుదన్నుగా నిలబడ్డాడు. స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం యుగంధర్ రెండేళ్లుగా ఈ సినిమాకే అంకితమయ్యారు. చివరగా నా ప్రొడ్యూసర్ అనిల్ సుంకర.. వారి తండ్రి రామబ్రహ్మం సుంకర పేరు వేస్తూ వచ్చారు. వారి ఆశిస్సులు మాకు ఉంటాయి. అన్ని రకాల వ్యాపారాల్లో సక్సెస్ అయ్యారు. సినిమాను డబ్బు కోసం కాక మంచి సినిమా అనే కాన్సెప్ట్ తో చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో వారి మొహంలో నవ్వు చూస్తే మంచి విజయం గ్యారెంటీ అనుకుంటున్నాను. ఆయనతో పాటు కొన్నవాళ్లందరికీ డబ్బులు రావాలనుకుంటున్నాను. గాడ్ ఫాదర్ టైటిల్ అడగ్గానే దేవుడికి నైవేద్యం అన్నట్టుగా ఇచ్చిన సంపత్ నందికి సభాముఖంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. శేఖర్ మాస్టర్ నా అభిమానిగా మంచి కొరియోగ్రఫీ చేశాడు.మీ అందరూ నాతో సినిమా చేసే అవకాశాన్ని అందిపుచ్చుకుని సినిమా ఇండస్ట్రీకి రావాలని ఆకాంక్షిస్తూ.. జై హింద్..”

Related Posts