కన్నడ హీరో భార్య హఠాన్మరణం

కన్నడ సినిమా పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్లిన కన్నడ హీరో విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన హఠాత్తుగా మరణించారు. స్పందన తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి బ్యాంకాక్ కు వెకేషన్ కు వెళ్లారు. అంతా సంతోషంగా ఉన్న టైమ్ లో సడెన్ గా స్పందనకు హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న హాస్పిటల్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం స్పందన మరణించారు.

ఇక విజయ్ రాఘవేంద్ర ఇప్పుడు ‘కడ్డా’ అనే సినిమా చేశాడు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం అతను బెంగళూరులోనే ఉన్నాడు.


విజయ్ రాఘవేంద్ర, స్పందనకు 2007లో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్పందన కూడా నటిగా అపూర్వ అనే చిత్రంలో నటించారు. 2016లో వచ్చిన ఈ చిత్రంలో రవిచంద్రన్ హీరో. ఇక స్పందన మృతి గురించి తెలిసిన వెంటనే ముఖ్యమైన కుటుంబ సభ్యులు బ్యాంకాక్ కు వెళ్లారు. మంగళవారం ఆమె భౌతికకాయాన్ని సొంత ఇంటికి చేర్చే అవకాశాలున్నాయి.

Related Posts