వాళ్లు జైలుకు వెళ్లే వరకూ పోరాడాను – అల్లు అరవింద్

భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ చేసిన కమెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ” నేను ఇక్కడికి ఈ సినిమా కోసం పనిచేసిన వారికి విష్ చెప్పడానికి వచ్చాను. చిరంజీవిగారు చూడని సక్సెస్ లేదా..ఆయనకు నేను ఇవాళ సక్సెస్ కావాలని కోరాల్సిన పనిలేదు. మీరంతా చిరంజీవిని చూసి పెరిగితే.. నేను ఆయనతో సినిమాలు చేస్తూ పెరిగాను.

ఆయన మీద నా అభిమానం చెప్పాల్సిన పనిలేదు. పన్నెండేళ్ల క్రిత చిరంజీవి గారి గురించి ఒకరు నీచంగా మాట్లాడారని వారిపై పన్నెండేళ్లూ పోరాటం చేసి జైలుకు వెళ్లేలా చేశాను. ఇంతమంది మంచి వాళ్లు తీసిన సినిమా డిఫినెట్ గా హిట్ కావాలని కోరుకుంటున్నాను..” అన్నాడు

Related Posts