బ్రో… ఇంట్లో వేస్తారు అట్టు.. ఈ సినిమా సూపర్ హిట్టు.. అంటూ హైదరాబాద్ లోని ఐమాక్స్ థియేటర్ ముందు అభిమానుల పేరుతో కొంతమంది రివ్యూ రాయుళ్లు చేసే అతి అందరికీ తెలుసు. ఇవన్నీ ప్రోగ్రామ్డ్ అని ఇండస్ట్రీలో కూడా చాలామందికి తెలుసు. బట్.. కొన్నాళ్లుగా వారివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్లు సూపర్ హిట్టు అని చెబుతారో ఆ సినిమాలన్నీ పోతున్నాయి.
దీంతో వీరి రివ్యూస్ కు క్రెడిబిలిటీ లేకుండా పోతోంది. వీరిని ఎంకరేజ్ చేస్తూ ఎన్నో యూ ట్యూబ్ ఛానల్స్ తో పాటు శాటిలైట్ వాళ్లు కూడా ఎగబడటం కామన్ అయిపోయింది. అయితే ఈ వారం నుంచి ఐమాక్స్ థియేటర్స్ ముందు వీరి రివ్యూస్ ను బ్యాన్ చేశారు. అందుకు కారణం ఆదిపురుష్ మూవీ కావడం విశేషం.
రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ కు భారీ విపరీతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. దీంతో పాటు యూ ట్యూబ్ ఛానల్స్.. శాటిలైట్ ఛానల్స్ కూడా అన్నీ వచ్చాయి.
ఆ క్రమంలో సినిమా బాగాలేదు అన్నందుకు ఓ రివ్యూవర్ పై అభిమానులు దాడి చేసి కొట్టారు. అది కాస్త పెద్ద ఇష్యూగా మారింది. సినిమా బాలేదు అంటే అభిమానుల పేరుతో రౌడీఇజం చేస్తారా అంటూ కొంతమంది విమర్శించారు కూడా. పైగా నిజంగానే అది బాగాలేని సినిమా. ఎవరైనా తమ అభిప్రాయాన్ని చెప్పుకోవచ్చు. అందరూ ఒకే అభిప్రాయం చెప్పాలని డిమాండ్ చేస్తూ భౌతిక దాడి చేయడం సరికాదు కదా. దీనికి తోడు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తోన్న ఐమాక్స్ యాజమాన్యంపై కూడా విమర్శలు వచ్చాయి.
దీంతో ప్రసాద్ ఐమ్యాక్స్ ముందు ఉన్న మెట్లపై ఇకపై ఎలాంటి కెమెరాలను, రివ్యూవర్స్ ను ఎంకరేజ్ చేయొద్దని యాజమాన్యం నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇవాళ్టి నుంచి అమలు చేస్తున్నారు కూడా. అయితే వీళ్లు థియేటర్ దాటి రోడ్డుపైనే దుకాణం పెట్టేశారు. దీనివల్ల ట్రాఫిక్ చిక్కులు మొదలయ్యాయి. ఈ తతంగం అంతా నడిచేది కేవలం ఓ అరగంట పాటే. అయినా మళ్లీ రోడ్ పై రివ్యూస్ అంటూ ఇంకెవరైనా కంప్లైట్స్ చేస్తే.. యూ ట్యూబ్ ఛానల్స్ కు ఇబ్బందులు తప్పవు. అందుకే వాళ్లు కూడా స్వీయ నియంత్రణ పాటిస్తూ.. మిగతా ఎవరికీ ఇబ్బంది లేని విధంగా ఓ ప్రాపర్ సెటప్ చూసుకుంటే మంచిదేమో.
It is known that 'Kalki 2' is going to be the sequel of 'Kalki'. Even…
'కల్కి' చిత్రానికి సీక్వెల్ గా 'కల్కి 2' రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు సీక్వెల్ గురించి…
The movie 'Kalki' is getting tremendous response from the audience all over the world. Not…
'కల్కి' చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ దక్కుతోంది. సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు సైతం…
For Telugu movies, Andhra, ceded, Nizam and Karnataka were the main areas in the past.…