‘ఆదికేశవ’ రివ్యూ.. వైష్ణవ్ తేజ్ కి హిట్..

పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ, ఆ తర్వాత నటించిన ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’ ఆశించిన విజయాలను అందించలేకపోయాయి. ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్న ‘ఆదికేశవ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ ఖాతాలో హిట్ చేరిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

బాలకోటయ్య (వైష్ణవ్ తేజ్) జాబ్ ట్రైలస్ లో ఉంటాడు. ఈ క్రమంలోనే చిత్రావతి (శ్రీలీల) సీఈవోగా పనిచేస్తున్న ఓ కాస్మెటిక్ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. అలా బాలకోటయ్యకి చిత్రావతితో పరిచయం.. ప్రేమగా మారుతుంది. చిత్రావతి ప్రేమను చెప్పాలనుకున్న సమయంలో చిన్న ట్విస్ట్. వేరే కంపెనీ సీఈవోతో చిత్రావతి తండ్రి పెళ్లి ఫిక్స్ చేస్తాడు. కంపెనీ నుంచి బాలకోటయ్య బయటకి వచ్చేసి చిత్రావతి తండ్రితో గొడవకి దిగుతాడు. ఇదే సమయంలో తనికెళ్ళ భరణి వచ్చి బాలకోటయ్యతో మీ నాన్న చనిపోయాడంటూ షాకింగ్ న్యూస్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..బాలకోటయ్య ఆదికేశవగా ఎందుకు మారాల్సి వచ్చింది..చిత్రావతిని పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఫస్టాఫ్ అంతా కామన్ స్టోరీ, కొన్ని ఫన్నీ సీన్స్ తో అలా అలా సాగుతుంది. కానీ, బాలయ్య కోటయ్య ఆదికేశవగా మారిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. సెకండాఫ్ లో కావలసినన్ని యాక్షన్ సీన్స్ తో నింపేశాడు దర్శకుడు. యాక్షన్ అండ్ ఎమోషన్స్ సీన్స్‌లో వైషన్ తేజ్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. సుమన్, రాధిక, తనికెళ్ళభరణి ల పర్ఫార్మెన్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. శ్రీలీల క్యారెక్టర్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ అనిపించదు. పాటల్లో లీలమ్మో మాత్రం మాస్ ఆడియన్స్‌తో విజిల్స్ వేయిస్తుంది. మొత్తంగా చూస్తే గత రెండు చిత్రాలతో పోల్చి చూసుకుంటే ఆదికేశవ వైష్ణవ్ తేజ్ కి హిట్ ఇచ్చేలానే ఉంది. లాంగ్ రన్‌లో ఆదికేశవ ఏ రేంజ్ హిట్ సాధిస్తుందనేది తెలుస్తుంది.

Related Posts