‘కంగువా‘ షూటింగ్ లో సూర్యకి ప్రమాదం

విలక్షణ నటుడు సూర్య అప్ కమింగ్ మూవీ ‘కంగువా‘. శివ కుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ సెట్ లో సూర్యకు ప్రమాదం జరిగిందట. చెన్నై ఈ.వి.పి. ఫిల్మ్ సిటీలో ఓ యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా.. కెమెరా మీద పడడంతో సూర్య భుజానికి గాయం అయ్యిందట. పెద్దగా ప్రమాదం ఏమీ లేకపోయినా.. సూర్య రెండు వారాల పాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉందట.

సూర్య, బాబీ డియోల్ మధ్య సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగిందని తెలుస్తోంది. సూర్యకి ప్రమాదం జరగడంతో నెల రోజుల పాటు ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్ లో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. స్టూడియో గ్రీన్, యు.వి.క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏకంగా 38 భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. 2024, ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని విడుదలకు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పఠాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో జగపతిబాబు, నట్టీ నటరాజ్, యోగిబాబు కనిపించబోతున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Related Posts