టాలీవుడ్

రేవ్ పార్టీ కేసులో నటి హేమకు బెయిల్

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమకు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెంగళూరు స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేవ్ పార్టీ కేసులో అరెస్టైన హేమకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఆమె పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. బెయిల్ లభించిన నేపథ్యంలో హేమ జైలు నుంచి బయటకు రానున్నారు.

గత నెల 20న బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ జరిగింది. జీ.ఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగిందని పోలీసులు గుర్తించారు. దాదాపు వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈకోవలోనే రేవ్ పార్టీలో పాల్గొన్న నటి హేమ డ్రగ్స్ టెస్ట్ రిజల్ట్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో.. హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి జ్యూడీషియల్ కస్టడీ విధించారు.

Telugu 70mm

Recent Posts

భారీ నిడివితోనే వస్తోన్న ‘భారతీయుడు 2’

గతంలో రెండున్నర గంటల నిడివితోనే ఎక్కువ సినిమాలు వచ్చేవి. అయితే.. కొన్ని సంవత్సరాలుగా నిడివి విషయంలో ఎలాంటి కండిషన్స్ పెట్టుకోవడం…

41 mins ago

రాజ్ తరుణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రియురాలు

యంగ్ హీరో రాజ్ తరుణ్‌ వివాదంలో చిక్కుకున్నాడు. రాజ్ తరుణ్ తనను ప్రేమించి, శారీరకంగా వాడుకుని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని…

55 mins ago

‘కుబేర’ కోసం సరికొత్తగా కనిపిస్తున్న రష్మిక

కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబోలో రూపొందుతోన్న మల్టీస్టారర్ 'కుబేర'. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న…

55 mins ago

కళ్యాణ్‌రామ్ ‘బింబిసార’ ప్రీక్వెల్ అనౌన్స్‌మెంట్

డెబ్యూ డైరెక్టర్స్ తో వండర్స్ క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కళ్యాణ్ రామ్ విషయంలో ఇది చాలా…

60 mins ago

The Shooting Of ‘Double Ismart’ Has Been Completed.

Energetic star Ram and dashing director Puri Jagannath are teaming up for the film 'Double…

2 hours ago

షూటింగ్ పూర్తిచేసుకున్న ‘డబుల్ ఇస్మార్ట్’

ఎనర్జటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతోన్న చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. ఫక్తు మాస్ ఎంటర్…

2 hours ago