‘ఆ… ఒక్కటీ అడక్కు’.. ముఫ్ఫై ఏళ్ల క్రితం ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన సినిమా ఇది. సూపర్ డూపర్ హిట్టైన ‘ఆ… ఒక్కటీ అడక్కు’ టైటిల్ తోనే అల్లరి నరేష్ సినిమా చేశాడు. మల్లీ అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలకా నిర్మిస్తున్న ఈ సినిమాతో మళ్లీ కామెడీ ట్రాక్ ఎక్కాడు అల్లరి నరేష్. ఈ మూవీలో పెళ్లికాని ప్రసాద్ టైప్ క్యారెక్టర్ లో కడుపుబ్బా నవ్వించబోతున్నాడు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ కి జోడీగా ఫరియా అబ్దుల్లా నటించింది. వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అసలు మార్చి 22నే ఆడియన్స్ ముందుకు రావాల్సిన ‘ఆ… ఒక్కటీ అడక్కు’ మే 3న విడుదలకు ముస్తాబవుతోంది.
ఈ సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వీడియో వదిలింది టీమ్. అసలు ఏప్రిల్ లో జరగాల్సిన ఎన్నికలు మే లో జరగడం లేదా? అలాగే.. మా చిత్రం కూడా వాయిదా పడింది. అయినా.. మా చిత్రంలో ఎంటర్ టైన్ మెంట్ కి ఏమాత్రం ఢోకా ఉండదు. ఈ సమ్మర్ కి కడుపుబ్బా నవ్వించడానికి వచ్చేస్తున్నాం … అంటూ ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వీడియోలో కనువిందు చేశాడు అల్లరి నరేష్.