‘కన్నప్ప’ ప్రపంచంలోకి బాలీవుడ్ ఖిలాడి హీరో

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో స్టార్ కాస్టింగ్ మామూలుగా లేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ బడా స్టార్స్ ఎంతోమంది ఈ సినిమాలో భాగస్వాములవుతున్నారు. లేటెస్ట్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోకి బాలీవుడ్ ఖిలాడి హీరో అక్షయ్ కుమార్ చేరాడు. ఇప్పటివరకూ డైరెక్ట్ గా తెలుగు సినిమాల్లో నటించని అక్షయ్ కి.. ఫస్ట్ టాలీవుడ్ మూవీ ఇది. తాజాగా అక్షయ్ ‘కన్నప్ప’ వరల్డ్ లోకి ఎంటరయ్యాడు. ఈ బాలీవుడ్ ఖిలాడి హీరోకి మోహన్ బాబు, విష్ణు సాదర స్వాగతం చెబుతున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు విష్ణు.

ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. అసలు ఈ మూవీలో శివుడిగా రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తాడని వినిపించింది. అయితే.. ప్రభాస్ నందీశ్వరుడి పాత్రలోనూ అక్షయ్ శివుడిగానూ అలరించబోతున్నట్టు లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్. మొత్తంమీద.. బాలీవుడ్ బడా హీరో అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం తెలుగు చిత్ర సీమకు గర్వకారణమే.

Related Posts