మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్.. ఎలా ఉంది

బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా నటించిన సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్ అంటే మహిళలే కదా అవుతారు. అందుకే మిస్టర్ ప్రెగ్నెంట్ అన్న టైటిల్ అనౌన్స్ చేసినప్పుడే చాలామంది ఆసక్తిగా చూశారు. ఇక ఈ మూవీ ట్రైలర్ ను నాగార్జున చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే ఇంప్రెసివ్ గానే ఉంది. ఇండియాలో మొదటి మేల్ ప్రెగ్నెంట్ అనే మాట వాడారు. అదెలా సాధ్యం అనేది సినిమాలోనే చూడాలేమో.

అమ్మాయిలకు టాటూలు వేసే ఓ కుర్రాడి కథగా ఈ ట్రైలర్ కనిపిస్తోంది. లైఫ్ అంతా క్రేజీ అనుకున్న ఆ కుర్రాడికి ప్రెగ్నెన్సీ వస్తుంది. తర్వాత అతను ఎదుర్కొన్న సమస్యలేంటీ.. సమాజం, బంధవులు అతన్ని ఎలా చూశారు.. అనేది ఓ ఎమోషనల్ డ్రామాగా కనిపిస్తోంది. కాకపోతే ఈ తరహా కథలను కామెడీగా చెబితే కనెక్ట్ అవుతాయి. బట్ వీళ్లు చాలా సీరియస్ గా ట్రై చేసినట్టు కనిపిస్తుంది. సీరియస్ గా ప్రయత్నించారు అంటే మిస్టర్ ప్రెగ్నెంట్ అనే మాటకు ఆస్కారం ఎలా ఉందనేది సైంటిఫిక్ గా ఆడియన్స్ కన్విన్స్ అయ్యేలా చెప్పగలిగితేనే వర్కవుట్ అవుతుంది. లేకపోతే ఇవి బూమరాంగ్ అవుతాయి.

ఓ మగాడు గర్భం దాల్చితే అతనికీ ఆడవారికి ఉన్న కోరికలే పుడతాయని చూపడం కొంత వింతగానూ, మరికొంత ఎంటర్టైనింగ్ గానూ కనిపిస్తోంది. ఇక ట్రైలర్ చివర్లో నిండు చూలాలు(అనొచ్చా)గా ఉన్న మిస్టర్ ఫైట్ చేసే సీన్ కూడా ఉంది. మరి ట్రైలర్ లోనే చెప్పినట్టుగా “ఇంకా ఎన్ని చూడాలో” కానీ ఇది అంతా ఊహించినట్టు కామెడీగా కాక యమ సీరయస్ గానే ఉంది. సోహైల్ కు జోడీగా రూప నటించింది. శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మైక్ టివి బ్యానర్ పై అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. ఈ నెల 18న ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ విడుదల కాబోతోంది.

Related Posts