టాలీవుడ్

పెదకాపు నుంచి మెలోడియస్ సాంగ్

శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తోన్న సినిమా పెదకాపు. ఈ చిత్రం మూడు భాగాలుగా రాబోతోంది. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకూ శ్రీకాంత్ చేసిన సినిమాలకు భిన్నమైన టేకింగ్ తో ఈ మూవీ కనిపిస్తోంది. ఫస్ట్ టైమ్ అతను మాస్ కంటెంట్ తో వస్తున్నాడని తెలుస్తుంది.

ఈ చిత్రంతో విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్. శ్రీకాంత్ కు ముందు నుంచీ కలిసొచ్చిన మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ పెదకాపు నుంచి ఓ మెలోడియస్ సాంగ్ ను విడుదల చేశారు.


కళ్యాణచక్రవర్తి త్రిపురనేని రాసిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి, చైత్ర అంబడిపూడి పాడారు. వినగానే ఆకట్టుకునే ట్యూన్ తో ఓ సూతింగ్ మెలోడీలా ఉందీ పాట. సాహిత్యం కూడా ఆకట్టుకునేలా ఉంది.
“హృదయములో అలజడి వాన.. కురిసేనే ఇలా నీ వలన.. ” అంటూ మొదలైన పాట ఆద్యంతం వినసొంపుగా ఉంది. ఆర్కెస్ట్రైజేషన్ బావుంది. ‘అరెరే అరెరే తన వాటమే .. అసలే పడదే మొహమాటమే.. పలుచగ వేసినా.. పావడ గోడ దాటినా.. జరపదు ఎందుకో తెలిసేనా”.. అని అతనంటే.. “చనువుగా చూసినా .. చూపులతో తినేసినా.. ఆకలి తీరునా.. అరిగేనా .. ” అంటుందామె.


ఈ పాటలోనే “బదులుగా వదలడమే.. వయసుకొక మర్యాదా.. ఆత్రపడి అడగాలా.. ఆ మాత్రమూ తెలియదా.. ” అనే పదాలు బావున్నాయి.మొత్తంగా మొదటి పాట వేసే ఇంపాక్ట్ ఏ సినిమాకైనా ప్లస్ అవుతుంది. పెదకాపుకు సంబంధించి ఈ పాట కూడా అలాగే ఉంది. ఇక సినిమాటోగ్రఫీ కూడా హైలెట్ అవుతుందనిపించేలా ఉంది. మామూలుగా చోటా కే నాయుడు అంటే ఎక్కువ కలర్స్ ఉంటాయి. ఈ సారి ఆ కలర్స్ కు భిన్నమైన కలర్ ఏదో యాడ్ చేసినట్టున్నాడు. అందుకే ఈ పాటలోనే విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మొత్తంగా ఓ మంచి పాటతో ఆకట్టుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల.

Telugu 70mm

Recent Posts

‘కన్నప్ప’ సినిమాలోని కీలక పాత్రలో కాజల్

మంచు విష్ణు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో తారల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్ట్ లోకి వరుసగా అగ్ర…

36 mins ago

Mirnalini Ravi

43 mins ago

Ketika Sharma

56 mins ago

Janhvi Kapoor

1 hour ago

NehaSolanki

1 hour ago