దిల్‌రాజు నిర్మాణంలో ధనుష్ సినిమా

మాతృభాష తమిళంలో మాత్రమే కాకుండా.. పరభాషల్లోనూ దూకుడు పెంచుతున్నాడు ధనుష్. ముఖ్యంగా ఈ మధ్య తెలుగులో బిజీ అవుతున్నాడు. ‘సార్’ చిత్రంతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ధనుష్.. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కి హాట్ ఫేవరెట్ గా మారాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడట.

శర్వానంద్ తో ‘శ్రీకారం’ చిత్రాన్ని చేసిన కిషోర్.బి దర్శకత్వంలో ధనుష్ సినిమా ఉంటుందట. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే.. ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట.

మరోవైపు.. ధనుష్ సొంత దర్శకత్వంలో ‘రాయన్’ సినిమా సెట్స్‌పై ఉంది. ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, సందీప్ కిషన్, సెల్వరాఘవన్, కాళిదాస్ జయరామ్ వంటి వారు నటిస్తున్నారు. ఈ ఏడాది జూన్ లో ‘రాయన్’ ఆడియన్స్ ముందుకు రానుంది. అలాగే.. ఇళయరాజా బయోపిక్ లోనూ ధనుష్ నటిస్తున్నాడు.

Related Posts