‘వార్ 2’ కోసం యాక్షన్ లో ఇరగదీస్తున్న ఎన్టీఆర్

బాలీవుడ్ లో యశ్ రాజ్ స్పై యూనివర్శ్ నుంచి వచ్చే సినిమాలకు సెపరేట్ క్రేజుంది. ఈ యూనివర్శ్ లోని సినిమాలు ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ ఘట్టాలతో.. మత్తెక్కించే అందాలతో.. ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తుంటాయి. ఈ కోవలోనే రెడీ అవుతోంది క్రేజీ మల్టీస్టారర్ ‘వార్ 2’. సూపర్ డూపర్ హిట్ ‘వార్’ మూవీకి కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

‘వార్’ సినిమాలో హృతిక్ రోషన్ – టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటిస్తే.. ‘వార్ 2’లో హృతిక్ కి దీటైన పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ‘వార్’ మూవీలో హృతిక్-టైగర్ మధ్య వచ్చే ఫైట్స్, వాళ్లిద్దరూ కలిసి చేసిన డ్యాన్సెస్ హైలైట్ అయ్యాయి. ఇప్పుడు అంతకుమించి అన్నట్టుగా ‘వార్ 2’లో హృతిక్-తారక్ మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్సెస్.. ఈ డ్యాన్సింగ్ స్టార్స్ ఇద్దరూ కలిసి చేసే డ్యాన్సులు హైలైట్ అవ్వనున్నాయట.

ప్రధానంగా ‘వార్ 2’లో ఎన్టీఆర్ మేకోవర్ సరికొత్తగా ఉండబోతుందట. అల్ట్రా మోడర్న్ లుక్ లో అదరగొట్టనున్నాడట తారక్. ఇక.. ఈ సినిమాలో యంగ్ టైగర్ చేసే ఫైట్స్ అయితే నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉంటాయట. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో.. ఎన్టీఆర్ పై చిత్రీకరించే యాక్షన్ ఘట్టాలు ‘వార్ 2’కే హైలైట్ అవ్వనున్నాయనేది బీటౌన్ టాక్.

Related Posts