Karthii : 96 దర్శకుడితో లవ్ స్టోరీలో కార్తీ

మోస్ట్ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ కార్తీ. రెండో సినిమా నుంచే తెలుగులోనూ తనదైన మార్కెట్ క్రియేట్ చేసుకున్న ఈ హీరో తనకంటే ముందు వచ్చిన ఎంతోమంది తమిళ్ హీరోల కంటే చాలా బెటర్ గా తెలుగులో మార్కెట్ తెచ్చుకున్నాడు.

పైగా తెలుగులో మొదటి సినిమా నుంచీ తనే డబ్బింగ్ చెప్పుకుంటూ మరింత దగ్గరయ్యాడు. ఇక రీసెంట్ గా సర్దార్, పొన్నియన్ సెల్వన్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న కార్తీ ప్రస్తుతం ”జపాన్” అనే డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన ఈ మూవీ ఇంటర్ డ్యూసింగ్ వీడియో చాలా ప్రామిసింగ్ గా కనిపించింది. ఈ మూవీతో పాటు ఖైదీకి సీక్వెల్ కూ రెడీ అవుతోన్న కార్తీ దానికంటే ముందు ఓ లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది కూడా తన సొంత అన్న బ్యానర్ లో కావడం విశేషం.


2018లో 96 అనే మూవీతో ఎంటైర్ సౌత్ ను మెస్మరైజ్ చేశాడు దర్శకుడు సి ప్రేమ్ కుమార్. ఒక తరం ప్రేక్షకుల ప్రేమకథలన్నీ తడిమిందీ చిత్రం. పరిమితమైన పాత్రలతో అద్భుతమైన ఎమోషనల్ లవ్ స్టోరీగా చూపించిన ఈ చిత్రం అక్కడ క్లాసిక్ అన్న పేరు తెచ్చుకుంది. తర్వాత అదే దర్శకుడు తెలుగులో శర్వానంద్, సమంత జంటగా జాను పేరుతో రీమేక్ చేశారు. బట్ మన దగ్గర ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు.

అయితే సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ గా మారిన సి ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లోనే ఇప్పుడు కార్తీ ఓ లవ్ స్టోరీ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. సూర్య, జ్యోతిక స్థాపించిన 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఈ చిత్రం రూపొందబోతోంది. ఈ మూవీ తర్వాత లోకేష్ కనకరాజ్ తో ఖైదీ రీమేక్ చేస్తాడు కార్తీ. మొత్తంగా సర్దార్ తో యాక్షన్, పొన్నియన్ సెల్వన్ తో ఎంటర్టైన్మెంట్ అందించి ఇప్పుడు జపాన్ గా ఎక్స్ పర్మెంట్ చేయబోతోన్న కార్తీ నెక్ట్స్ లో లవ్ స్టోరీతో వస్తున్నాడన్నమాట.

Related Posts