టాలీవుడ్

ఖుషీ మరో శాకుంతలం కాదు కదా..

ఖుషీ.. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా. ముందు నుంచీ ఈ మూవీపై ఓ పాజిటివ్ వైబ్ ఉంది. ఇప్పటి వరకూ విడుదలైన పాటలన్నీ అద్భుతంగా ఉన్నాయన్న పేరు తెచ్చుకున్నాయి. యూ ట్యూబ్ లో వాటి వ్యూస్ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. టీజర్ఇంప్రెస్ చేసింది. అయితే ట్రైలర్ మాత్రం ఆశించినంత గొప్పగా లేదు అనే టాక్ వచ్చింది. భారతీయ సంప్రదాయాలు, పెళ్లి, దంపతుల మధ్య మనస్ఫర్థలు అంటూ చాలా పెద్ద వ్యవహారమే ఉంది. దీనికి ముందు మంచి ప్రేమకథ ఉండేలా అనిపించింది. బట్.. ట్రైలర్ లోనే సినిమా కథంతా కనిపించింది. దీంతో ఇలాంటి కథలు చాలానే చూశాం కదా అనే ఫీలింగ్ చాలామందిలో కలిగింది. కశ్మీర్ బ్యాక్ డ్రాప్ కూడా కేవలం దర్శకుడికి తన ఫేవరెట్ డైరెక్టర్ మణిశర్మ రోజా మూవీ కోసమే పెట్టాడా అనే డౌట్ వచ్చినా తప్పు కాదు. ఎందుకంటే ఆ ఎపిసోడ్ కు సంబంధించిన వ్యవహారాన్ని ” బేగమ్ కాదు.. బ్రాహ్మిణ్‌” అని ఒక్క ముక్కలో తేల్చేశాడు. కాకపోతే ఈ కాంట్రాస్ట్ సినిమాలో ఉంటుందా లేదా అనేది రిలీజ్ తర్వాత కానీ తెలియదు. ఇక ఈ మూవీ మరో శాకుంతలం కాబోతోందా అనే కొత్త టాక్ బయట వినిపిస్తోంది. అందుకు కారణాలు లేకపోలేదు.


ఖుషీపై సమంత ఎప్పుడూ పెద్ద ఇంట్రెస్ట్ గా కనిపించలేదు. తను మయోసైటీస్ నుంచి కోలుకుని వచ్చిన తర్వాత.. ముందు ఒప్పుకున్న ఖుషీని కాదని సిటాడెల్ షెడ్యూల్స్ లో జాయిన్ అయింది. తిరిగి వచ్చింది కదా అని దర్శకుడు షూటింగ్ ప్లాన్ చేసుకుంటే తను మాత్రం సరిగా రెస్పాండ్ కావడం లేదు అనే వార్తలు అప్పుడే వచ్చాయి. అదే సమయంలో సిటాడెల్ కు మాత్రం కావాల్సినన్ని డేట్స్ అడ్జెస్ట్ చేసింది. ఇక నిర్మాతలు బతిమాలుకోవడంతో ఖుషీ షూటింగ్ కు వచ్చింది. సినిమా అయిపోయింది. తర్వాత తను వెకేషన్ కు వెళ్లిపోయింది. రీసెంట్ గా వెకేషన్ నుంచి వచ్చింది తను. ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ కు ముందే తను చెన్నైలోని చిన్మయి శ్రీపాద ఇంట్లో ఆమె పిల్లలతో ఆడుకుంటూ కనిపించింది. బట్ ఈ ఈవెంట్ కు రాలేదు. ఇటు చూస్తే వీళ్లేమో ప్యాన్ ఇండియన్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. అందుకు సపోర్ట్ గా ఉండాల్సిన సమంత ఖుషీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను లైట్ తీసుకుంది. అంతే కాదు.. తర్వాత కూడా ఆ ట్రైలర్ గురించి ఒక్కమాట కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. కంప్లీట్ గా ఇగ్నోర్ చేసింది.

గతంలో శాకుంతలం టైమ్ లో కూడా ఒక ఇంటర్వ్యూ మాత్రమే ఇచ్చింది. తీరా సినిమా రిలీజ్ దగ్గరకు రాగానే హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడూ అదే జరుగుతోందంటున్నారు. సెప్టెంబర్ 1నే ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికీ తను ఖుషీ గురించి ఒక్క ముక్కా చెప్పడం లేదు. తను ఖుషీ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ కు రాకపోవడం కంటే అసలేం మాట్లాడకపోవడం మేకర్స్ ను ఎక్కువగా ఇబ్బంది పెట్టింది. అందుకే మళ్లీ వెళ్లి బతిమాలుకున్నారట. దీంతో ఒక కామన్ ఇంటర్వ్యూతో పాటు, ఒక మ్యూజికల్ నైట్ ఈవెంట్ కు అటెండ్ అవుతానని చెప్పిందంటున్నారు. ఇది కూడా ఇంకా కన్ఫార్మ్ కాలేదు. వస్తుందా లేదా అనేది వచ్చాకే తెలుస్తుంది. మొత్తంగా సమంత తీరు చూస్తోంటే శాకుంతలం టైమ్ లో ప్రవర్తన గుర్తొస్తోంది. అందుకే ఈ మూవీ రిజల్ట్ ముందే ఎక్స్ పెక్ట్ చేయడం వల్లే లైట్ తీసుకుంటుందా.. లేక నిజంగానే తనకు ఆరోగ్యం సహకరించడం లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆడియన్స్. ఏదేమైనా ఇలాంటి సందర్భాల్లో సెన్సిటివ్ ఇష్యూస్ కంటే సెన్సేషనల్ ఇష్యూస్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు కొందరు. అందుకే సమంతపై ఇంత ఒత్తిడి కనిపిస్తోంది.

Telugu 70mm

Recent Posts

‘దేవర’ ఫస్ట్ సింగిల్.. ఎన్టీఆర్ కోతకు అనిరుధ్ మోత

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…

44 mins ago

మహేష్-రాజమౌళి సినిమాలో మలయాళీ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…

3 hours ago

కమల్ కి డబుల్ ధమాకా ఇవ్వబోతున్న శంకర్

మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…

4 hours ago

బాబాయ్ కోసం అబ్బాయ్ అవుట్?

నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…

4 hours ago

‘కల్కి‘లోని బుజ్జి పరిచయం కోసం భారీ వేడుక

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…

4 hours ago

Two Things Are troubling ‘Pushpa 2’

After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…

9 hours ago