‘అయలాన్’ తర్వాత ‘అమరన్’గా శివకార్తికేయన్

కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ సినిమాల స్పీడు మామూలుగా లేదు. ఇప్పుడు ఒకేసారి రెండు బడా మూవీస్ ను లైన్లో పెట్టాడు. వీటిలో విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మిస్తున్న చిత్రం ఒకటి కాగా.. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా మరొకటి. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న శివకార్తికేయన్ 23వ చిత్రం లేటెస్ట్ గా ముహూర్తాన్ని పూర్తిచేసుకుంది. ఇక.. కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి ‘అమరన్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

రేపు (ఫిబ్రవరి 17న) శివకార్తికేయన్ బర్త్ డే స్పెషల్ గా ‘అమరన్’ టైటిల్ ను రివీల్ చేస్తూ స్పెషల్ టీజర్ రిలీజ్ చేసింది టీమ్. ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వరదరాజన్ గా కనిపించబోతున్నాడు శివ కార్తికేయన్. సాయిపల్లవి అతనికి జోడీగా నటిస్తుంది. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీకి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Related Posts