చల్లని సాయంత్రం వేళ శంకర్‌జైకిషన్‌ పాటల హేల

భారతీయ సినీ సంగీత చరిత్రలో శంకర్‌ జై కిషన్‌ స్థానం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో మధురమైన గీతాలను స్వరపరిచి శ్రోతల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న సంగీత దర్శకులు. 2014 లో వారి పేరిట ఓ అభిమాన సంఘం ఏర్పాటయ్యింది. ఈ ఫ్యాన్స్ అసోసియేషన్‌ ఆర్గనైజర్ లక్ష్మి గారు. లక్ష్మీనారాయణ గారు, గురువారెడ్డి గార్లు. 12 వ ఆల్‌ ఇండియా బ్రిడ్జ్‌ టోర్నమెంట్ సందర్భంగా శంకర్‌జైకిషన్‌ మధుర గీతాలతో కార్యక్రమం నిర్వహించారు.
ఈ చల్లని సాయంత్రం వేళ మధురమైన శంకర్‌జైకిషన్‌ గీతాలతో చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తమ్మారెడ్డి భరధ్వాజ.

శంకర్‌ జై కిషన్ అభిమాన సంఘం 2014 లో నెలకొల్పామనీ.. అప్పట్లో పాటలు ఎంత మధురంగా ఉండేవో నేటితరానికి తెలియాలనీ.. ఆ గోల్డెన్ ఎరాలో అందరూ చక్కని పాటలు పొందుపర్చేవారు.. మేము శంకర్‌ జైకిషన్‌ పేరిట అభిమాన సంఘం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు ఆర్గనైజర్ లక్ష్మీగారు. ఈ ఆర్గనైజేషన్ ద్వారా ప్రజలకు వైద్య సాయం చేయడం లాంటి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నాము. భారత దేశం లో ఓ యుద్ధ సమయంలో ఇందిరా గాంధీ గారు ఫండ్స్ అడిగినప్పుడు మొదటిగా శంకర్ జైకిషన్ గారు ముందుకు వచ్చారు. అందుకే ఆయన అంటే మాకు అభిమానం. అదేవిధంగా ఎంతోమందికి ఆపరేషన్ల కోసం సహాయం చేశారు. ఆలా ఆయన గురించి చెప్పాలి అంటే ఎన్నో ఉన్నాయి. అదే బాటలో మేము గతంలో కొన్ని కొంతమందికి సహాయం చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈశ్వర్ చంద్ర హాస్పిటల్స్ ద్వారా ప్లాస్టిక్ సర్జరీస్ ఆపరేషన్ కి సహాయం చేయాలనుకుంటున్నామన్నారామె.

లక్ష్మి గారు ఇలా ఓ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరంగా ఉంది. ఎఫ్ ఎన్ సి సి ఏర్పడటంలో తన వంతు కృషి ఉండటం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు లక్ష్మీనారాయణ గారు. అలాగే గురువారెడ్డి గారి కొత్త హాస్పిటల్‌ ఏర్పాటు పట్ల సంతోషం వ్యక్తం చేసారు.
నా హాస్పిటల్‌లో FNCC వారికి , కళాకారులకు మంచి మెడికల్ ప్యాకేజీ ఇస్తానన్నారు డాక్టర్‌ గురువారెడ్డి గారు. శంకర్ జైకిషన్‌ గార్లను కలవలేదు కానీ వారి పాటలంటే చాలా ఇష్టమన్నారు. ఆలాగే నేను పాడను కానీ పాటలు బాగా వింటానన్నారు. ఈ కార్యక్రమం నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎఫ్ ఎన్ సి సి ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు గారు, వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగారావు గారు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ గారు, జాయింట్ సెక్రెటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు గారు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి గారు, మెంబర్స్ కాజా సూర్యనారాయణ గారు, బాలరాజు గారు, ఏడిద సతీష్ (రాజా) గారు, వరప్రసాద రావు గారు, సామా ఇంద్రపాల్ రెడ్డి గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కే. ఎల్. నారాయణ గారు, డైరెక్టర్ బి. గోపాల్ గారు, కల్చరల్ కమిటీ చైర్మన్ తమ్మిరెడ్డి భరద్వాజ్ గారు, శంకర్ జైకిషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజర్ లక్ష్మి గారు, లక్ష్మి నారాయణ గారు, గురువారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

Related Posts