HomeLatestరావు రమేష్‌ 'మారుతినగర్‌ సుబ్రమణ్యం' ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

రావు రమేష్‌ ‘మారుతినగర్‌ సుబ్రమణ్యం’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

-

ఇండస్ట్రీలో వేళ్ల మీద లెక్కబెట్టదగ్గ విలక్షణ నటుల్లో రావు రమేష్ ఒకరు. ఎలాంటి క్యారెక్టర్‌నైనా తనదైన స్టైల్‌ లో ప్రత్యేకత తెచ్చిపెట్టగల నటుడాయన. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా రకరకాల పాత్రల్లో ఒదిగిన నటుడు రావు రమేష్‌. ఈసారి ఇంకాస్త ముందుకెళ్తూ.. మెయిన్‌ లీడ్ చేస్తున్నారు. సినిమా పేరు మారుతినగర్‌ సుబ్రమణ్యం. ఇంద్రజ ఫిమేల్ లీడ్ చేస్తున్నారు.


అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందుతోం. లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకుడు. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు. ప్రేక్షకులే ముఖ్య అతిథులుగా వినూత్నంగా ఫస్ట్ లుక్ విడుదల ప్లాన్ చేశారు.మారుతినగర్‌ సుబ్రమణ్యం ఫస్ట్‌లుక్ ను వినూత్నంగా చేసారు. ఇందుకోసం సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు బెజవాడ మావయ్య, కేజీఎఫ్‌ రాఘవన్ క్యారెక్టర్‌లతో రావు రమేష్ కాన్వర్జేషన్‌తో క్రియేట్ చేయడం ప్రేక్షకులను అలరించింది.


మారుతి నగర్ సుబ్రహ్మణ్యం… ఈ సినిమా భలే గమ్మత్తుగా ఉంటుంది. అయితే, ఈ సినిమా పోస్టర్ ఎవరు ఆవిష్కరిస్తే బావుంటుందని అనుకున్నా. నటుడిగా నాకు ఈ స్థాయిని, ఈ స్థానాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులే ఆవిష్కరిస్తే బావుంటుందని మేమంతా మనస్ఫూర్తిగా నమ్మాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే… వీడియో చివర్లో వచ్చే క్యూఆర్ కోడ్ ని మీ చేతులతో స్కాన్ చేయండి. నా పోస్టర్ ఆవిష్కరించండి, ప్రోత్సహించండి” అని విజ్ఞప్తి చేశారు రావు రమేష్.

ఇవీ చదవండి

English News