రష్మికకు తృటిలో తప్పిన పెనుప్రమాదం

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నాకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్ వెళ్లేందుకు ముంబైలో విస్తారా విమానమెక్కింది రష్మిక. అయితే టేకాఫ్ అయిన అరగంటకే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో.. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబైలో ల్యాండ్ చేశారు పైలట్లు. ఆ తర్వాత మరో విమానంలో ప్రయాణికులను తరలించారు.

సాంకేతిక సమస్య తలెత్తిన ఫ్లైట్ లో రష్మికతో పాటు మరో నటీమణి శ్రద్ధా దాస్ కూడా ఉంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ విషయాన్ని ఇన్ స్టా గ్రామ్ వేదికగా తెలియజేస్తూ.. ‘ఈ రోజు మేం చావు నుంచి తప్పించుకున్నాం’అంటూ శ్రద్ధా దాస్ తో దిగిన సెల్ఫీని షేర్ చేసింది రష్మిక.

Related Posts