గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న ‘శివ ట్రాప్‌ ట్రాన్స్‌ సాంగ్’

ఏజెంట్ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ తరహాలో క్లాస్‌ సౌండ్ వినిపించే టైటిల్‌తో థ్రిల్లర్స్‌ ను అందిస్తున్నారు తెలుగు మేకర్స్‌. ఇప్పుడు భూతద్వం భాస్కర్‌ నారాయణ టైటిల్‌తో సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చే థ్రిల్లర్‌ మూవీ రెడీ అయ్యింది. పురుషోత్తంరాజ్‌ డైరెక్షన్‌లో స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాలో శివ కందుకూరి హీరోగా నటిస్తున్నారు. వరుస హత్యల మిస్టరీని డిటెక్టివ్‌ భాస్కర్‌ నారాయణ్‌ ఎలా ఛేదించాడనే ఇంట్రస్టింగ్ పాయింట్‌తో కట్‌ చేసిన టీజర్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ఇదే మూవీ నుంచి మరో థ్రిల్లింగ్ ఎలిమెంట్ ను లాంచ్ చేసారు . శివ ట్రాప్‌ ట్రాన్స్‌ సాంగ్‌ ను రిలీజ్‌ చేసారు. ఈ సాంగ్‌ గూస్‌బంప్స్‌ తెప్పించేలా శ్రీచరణ్‌ పాకాల మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఈ పాటను ఆస్కార్‌ విజేత ఎంఎం కీరవాణి రిలీజ్ చేసారు.


చైతన్య ప్రసాద్ అందించిన లిరిక్స్ అద్భుతంగా వున్నాయి. సింగల్ కాలభైరవ హై ఎనర్జీతో పాడిన ఈ పాట నిజంగానే ఒక ట్రాన్స్ లోకి తీసుకెళుతుంది. ఈ పాట లిరికల్ విజువల్స్ AI చాట్ జీపీటీని ఉపయోగించి రూపొందించారు. ఇండియన్ సినిమాలో మొదటి 𝐀𝐈 జెనరేటడ్ లిరికల్ వీడియో ఇదే కావడం విశేషం. హీరో సుహాస్ ముఖ్య అతిధిగా హాజరై ఈ సాంగ్ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగింది. దర్శకుడు విజయ్ కనకమేడల, హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు.
సాంగ్ లాంచ్‌ వేడుకకు విచ్చేసిన అతిధులు, చిత్ర యూనిట్ చిత్ర విజయాన్ని కాంక్షిస్తూ.. చిత్ర యూనిట్‌ని అభినందించారు.

Related Posts