‘హనుమాన్‘ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

గడిచిన సంక్రాంతి బరిలో ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన విజయాన్ని సాధించింది ‘హనుమాన్‘ చిత్రం. అసలు సంక్రాంతి సీజన్ అంటేనే పెద్ద హీరోల సినిమాలు గుర్తుకొస్తాయి. కానీ.. పోయిన సంక్రాంతికి పెద్ద సినిమాలను తలదన్నేలా అతిపెద్ద విజయాన్ని సాధించింది ‘హనుమాన్‘. వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టిన ‘హనుమాన్‘ లేటెస్ట్ గా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుందట.

ఇప్పటికే సంక్రాంతి బరిలో విడుదలైన సినిమాలు ‘సైంధవ్, గుంటూరు కారం, నా సామిరంగ‘ ఓటీటీలోకి వచ్చేశాయి. ‘హనుమాన్‘ కూడా ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు ఈపాటికే విడుదలవ్వాల్సింది. అయితే.. థియేట్రికల్ రన్ కొనసాగుతుండడంతో ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ను పొడిగించారు. ఫైనల్ గా మార్చి 2 నుంచి జీ5 వేదికగా ‘హనుమాన్‘ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ‘హనుమాన్‘ ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.

Related Posts