‘భగవంత్ కేసరి’ రీమేక్ కి భారీ డిమాండ్

నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘భగవంత్ కేసరి’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే.. కథకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ అనిల్ రావిపూడి తీర్చిదిద్దిన చిత్రమిది. అలాగే.. ఇమేజ్ ను పక్కనపెట్టి కథ నచ్చితే చాలు ఎలాంటి పాత్రనైనా చేయడానికి తాను సిద్ధమని ఈ చిత్రంతో మరోసారి నిరూపించాడు నటసింహం.

సీనియర్ హీరోస్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ‘భగవంత్ కేసరి’ రీమేక్ కోసం పరభాషా హీరోలు పోటీపడుతున్నారట. ముఖ్యంగా తమిళనాట ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి దళపతి విజయ్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పూర్తిస్థాయిలో పాలిటిక్స్ లో బిజీ కానున్న విజయ్.. తెలుగు నిర్మాణ సంస్థ డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ‘భగవంత్ కేసరి’ రీమేక్ నే డి.వి.వి. లో చేయాలనుకుంటున్నాడట విజయ్. కన్నడలో ఈ సినిమాని రీమేక్ చేయడానికి స్టార్ హీరో శివరాజ్ కుమార్ రెడీగా ఉన్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్.

Related Posts