నటసింహం నందమూరి బాలకృష్ణ ఎనర్జీని ఆన్ స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుల్లో బోయపాటి శ్రీను ముందు వరుసలో నిలుస్తాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘సింహా, లెజెండ్, అఖండ‘.. ఒక చిత్రానికి మించి మరొకటిగా ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వబోతుందట. ఇప్పటికే బోయపాటి చెప్పిన స్టోరీ లైన్ కి నటసింహం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రెజెంట్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో బాలకృష్ణ. దీంతో నిర్మాతలంతా బాలయ్యతో సినిమాకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలిస్టులో టాప్ ప్రొడక్షన్ హౌజ్ గీతా ఆర్ట్స్ కూడా ఉంది. ఎప్పుడైతే బాలయ్యతో ‘అన్ స్టాపబుల్‘ మొదలుపెట్టాడో.. నిర్మాత అల్లు అరవింద్ కి, బాలకృష్ణకి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అప్పట్నుంచి వీరిద్దరి కాంబోలో సినిమాకోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. బోయపాటితో బాలయ్య చేయబోయే సినిమా గీతా ఆర్ట్స్ లోనే ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. అలాగే.. ‘అఖండ‘ చిత్రాన్ని నిర్మించిన ద్వారకా క్రియేషన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యమయ్యే అవకాశాలున్నాయట.
Low footfall due to elections and IPL has caused losses to theatres. This has affected…