ఇంటర్వ్యూలు

‘రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి’ చిన్న సినిమాగా మొదలై పెద్ద సినిమా దర్శకుడు సత్యరాజ్‌, హీరో రవితేజ నున్నా

నున్నా రవితేజ, నేహ జురెల్ జంటగా.. సత్యరాజ్‌ డైరెక్షన్‌లో నున్నా కుమారి, ముత్యాల రామదాసు నిర్మిస్తున్న మూవీ ‘రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి’ . ప్రమోషనల్ వీడియోస్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9 న గ్రాండ్ రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా హీరో రవితేజ నున్నా, దర్శకుడు సత్యరాజ్‌ మీడియాతో ముచ్చటించారు.


ఈ సినిమా చాలా ఇంటెన్స్ సబ్జెక్ట్ తో సాగుతుందని, ఇందులో రొమాంటిక్ సీన్స్ చేసేటపుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డానన్నారు రవితేజ నున్నా. హీరోయిన్ హత్య తో ముడిపడే కథాంశం ఇది అన్నారు.
నిర్మాత ముత్యాల రామదాసు గారు, పీఆర్ఓ వేణు గారు ఈ సినిమాని రెండు కళ్ళు లాంటి వారు. వారి వల్లే సినిమా ఇంతలా ముందుకు వెళ్తుంది. మొదట సతీష్ గారితో కలిసి మేము తక్కువ బడ్జెట్ తో చాలా చిన్న సినిమాగా ప్రారంభించాం. పదిరోజుల చిత్రీకరణ పూర్తయిన తర్వాత.. సినిమా చాలా బాగా వస్తుంది, ఎవరైనా సపోర్ట్ లభిస్తే బాగుంటుంది అనిపించింది. అలా ముత్యాల రామదాసుని సంప్రదించాం. ఆయన వచ్చాక సినిమా స్వరూపమే మారిపోయింది. ఎందరో మంచి మంచి ఆర్టిస్ట్ లు వచ్చి చేరారు. చిన్న సినిమా కాస్తా పెద్ద సినిమా అయిపోయిందన్నారు దర్శకుడు సత్యరాజ్‌.
దర్శకుల సలహాలు పాటిస్తూ నటించాననీ.. ప్రత్యేకించి శిక్షణ తీసుకోలేదన్నారు రవితేజ నున్నా. రవితేజ నటుడికి నూటికి నూరు శాతం న్యాయం చేసాడనీ.. వాస్తవానికి అతని నటన చూసే ముత్యాల రామదాసు గారు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారని అన్నారు సత్యరాజ్‌.
మాది అమలాపురం. మా దగ్గర ఎన్నో సినిమాలు తీస్తుంటారు. అలా నాకు సినిమాల మీద ఆసక్తి కలిగింది. ఈ సినిమా కథ వచ్చేసి ఏడాది క్రితం జబర్దస్త్ బాబీ మేమంతా కలిసినప్పుడు ఈ స్టోరీ లైన్ చెప్పాను. విన్న అందరూ బాగుంది అన్నారు. ఒక వారం రోజుల్లో మొత్తం డెవలప్ చేసి చెప్పిన తర్వాత వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఇది సినిమాగా చేస్తే బాగుంటుంది అనుకున్న తర్వాత హీరోని కలవడం జరిగింది. తర్వాత నిర్మాతలను, సంగీత దర్శకుడు రోషన్ ను కలిశాను. రోషన్ నాకు మంచి స్నేహితుడు. అతనికి కథ బాగా నచ్చి, వెంటనే ట్యూన్స్ ఇచ్చాడు. అక్కడి నుంచి అలా ప్రొడక్షన్ మొదలైందన్నారు సత్యరాజ్‌. అలాగే.. వితేజ నాకు ఎప్పటి నుంచో స్నేహితుడు. ఆ గ్రామీణ నేపథ్యానికి, ఆ పాత్రకి అతను సరిగ్గా సరిపోతాడు అనిపించింది. పైగా ఈ కథకి కొత్త నటుడు అయితేనే బాగుంటుంది. కథ వినగానే రవితేజ కూడా ఈ సినిమా చేయడానికి ఎంతో ఆసక్తి చూపించాడన్నారు.


హీరోగా మొదటి చిత్రం యాక్షన్ ఫిల్మ్ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనే సందేహం ఉంటుంది. కానీ ఇది మంచి కంటెంట్ ఉన్న థ్రిల్లర్ సినిమా. ఇలాంటి సినిమా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో వెంటనే అంగీకరించానన్నారు రవితేజ.
టైటిల్, పోస్టర్ల వల్ల మాత్రమే ఇది ప్రేమ కథా చిత్రం అనే భావన కలుగుతుంది. కానీ టీజర్, ట్రైలర్ చూస్తే ఇది క్రైమ్ థ్రిల్లర్ సినిమా అని అర్థమైపోతుంది. కథలో పెద్ద ట్విస్ట్ ఉంటుంది. అది ప్రచార చిత్రాల్లో ఎక్కడా రివీల్ కాకుండా జాగ్రత్త పడుతున్నాం. అది స్క్రీన్ మీదే ఆడియన్స్ కి పెద్ద సర్ ప్రైజ్ లా ఉండాలని ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటివరకు ప్రచార చిత్రాల్లో ఎక్కడా చూపించని ఒక పాత్ర సినిమాలో ఉంటుంది. సినిమా చూసినప్పుడు మీకు అది సర్ ప్రైజ్ ఇస్తుందన్నారు దర్శకుడు సత్యరాజ్‌.

Telugu 70mm

Recent Posts

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అమలాపాల్

నటీమణి అమలా పాల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బాబు జూన్ 11న పుట్టాడని.. అతనికి 'ఇళై' (ILAI) అని…

10 mins ago

Prabhas in two getups for ‘Spirit’

Prabhas is a perfect character police cut out. However.. till now I have not got…

15 mins ago

‘స్పిరిట్’ కోసం రెండు గెటప్స్ లో ప్రభాస్

ప్రభాస్ కటౌట్ కి సూటయ్యే పర్ఫెక్ట్ క్యారెక్టర్ పోలీస్. అయితే.. ఇప్పటివరకూ డార్లింగ్ ను పోలీస్ డ్రెస్ లో చూసే…

18 mins ago

Priyadarshi with an unique song for ‘Darling’

Priyadarshi is making a breakthrough as a comedian and also showing his uniqueness with unique…

23 mins ago

‘డార్లింగ్’ కోసం మందు పాటతో ప్రియదర్శి

ఒకవైపు కమెయడిన్ గా అగ్రపథాన దూసుకెళ్తూనే.. మరోవైపు కథానాయకుడిగానూ ప్రత్యేకమైన పాత్రలతో తన విలక్షణతను చాటుకుంటున్నాడు ప్రియదర్శి. ఈకోవలోనే ప్రియదర్శి,…

26 mins ago

Trivikram visits Tirumala

Director Trivikram Srinivas reached Tirumala through Alipiri trail for darshan of Tirumala Srivaaru. The related…

27 mins ago