శివుని ఆజ్ఞ కాబట్టే ‘భీమా’ శివరాత్రికి రిలీజ్‌ అవుతుంది: హీరో గోపిచంద్‌

టాలీవుడ్ యాక్షన్‌ కింగ్ గోపీచంద్‌, మాళవిక శర్మ, ప్రియా భవాని శంకర్‌ మెయిన్ లీడ్‌లో ఎ.హర్ష డైరెక్షన్‌లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌లో కెకె రాధామోహన్‌ నిర్మించిన మూవీ భీమా. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న గ్రాండ్ రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు హీరో గోపిచంద్.
ఈ చిత్ర దర్శకుడు ఎ. హర్షను కో ప్రొడ్యూసర్‌ శ్రీధర్ కోవిడ్ టైమ్‌లో పరిచయం చేసారన్నారు. అయితే అప్పటికి పోలీస్‌ క్యారెక్టర్‌ లో ఏదైనా డిఫరెంట్ ట్రై చేయమని చెప్తే.. 8 నెలల తర్వాత భీమా కథ చెప్పడంతో.. ఇందులో ఉన్న సెమీ ఫాంటసీ బాగా నచ్చింది. పోలీస్ క్యారెక్టరైజేషన్‌ చాలా బాగుందన్నారు గోపీచంద్.
రాక్షసులను చంపాలంటే.. బ్రహ్మ రాక్షసుడై ఉండాలి.. అందుకే భీమా లో బ్రహ్మ రాక్షసుడు అని పెట్టారన్నారు. ఇందులో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. యాక్షన్ సీక్వెన్స్‌లో ఎమోషన్‌ అద్భుతంగా వర్కవుట్ అయ్యిందన్నారు. సెమీ ఫాంటసీ ఎపిసోడ్ చాలా బాగా వర్కువట్ చేసాడు డైరెక్టర్‌.. ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తున్నారు గోపీచంద్.


ఇంతకు ముందు గోలీమార్, ఆంధ్రుడు, శౌర్యం సినిమాల్లో పోలీస్ పాత్రలు చేసాను.. కానీ భీమా డిఫరెంట్ పోలీస్‌ క్యారెక్టర్.. ఇందులో సెమీ ఫాంటసీ స్పెషల్ ఎలిమెంట్‌. మిగతా సినిమాలకు ఇది డిఫరెంట్ పోలీస్ పాత్ర అన్నారు. అఖండతో పోల్చడం పై స్పందిస్తూ.. అఘోరాలు, పరశురామక్షేత్రం బ్యాక్‌డ్రాప్, మ్యూజిక్ వల్ల అలా అనుకుని ఉండొచ్చు కానీ అఖండతో పోలిక లేదన్నారు.. అయినా అఖండ లాంటి బ్లాక్‌బస్టర్‌తో పోల్చితే మంచిదేగా అన్నారు నవ్వుతూ.ప్రభాస్‌తో చాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని చెప్పారు గోపీచంద్‌.


ఈ సినిమాలో శివుని నేపథ్యం ఉండటం శివుని ఆజ్ఞేనని అందుకే శివరాత్రికి రిలీజ్ కాబోతుందన్నారు.
అప్‌కమింగ్ మూవీస్‌ గురించి చెప్తూ.. శ్రీను వైట్ల గారితో చేస్తున్న సినిమా ముఫ్ఫై శాతం అయ్యింది. తర్వాత ప్రసాద్ గారితో ఒక సినిమా వుంటుంది. రాధతో ఒక కథ వర్క్ జరుగుతోంది. అది యూవీ క్రియేషన్స్ లో వుంటుందన్నారు.


ఈ సినిమా కు రవి బస్రూర్‌ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారన్నారు. నిర్మాత రాధామోహన్ ప్యాషన్‌ ఉన్న నిర్మాత .. గతంలో పంతం అనే సినిమా చేసాం వ్యక్తిగతంగా నాకు చాలా క్లోజ్ అని చెప్పారు.
ఈ సినిమాలో మాళవిక శర్మ, ప్రియాభవాని శంకర్‌ల పాత్రలకు మంచి పర్పస్‌ ఉంటుందన్నారు. డైరెక్షన్‌ గురించి అడిగితే.. డైరెక్షన్‌ జాబ్‌ వెరీ టఫ్..నేను చేయలేనని బదులిచ్చారు.

Related Posts