‘షి ఈజ్ రియల్’ లిరికల్ సాంగ్‌తో నవదీప్‌ ‘లవ్‌మౌళి’

నవదీప్ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌. గతంలో చందమామ, గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ వంటి సినిమాలతో హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు., అయితే రీసెంట్ టైమ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పెద్ద పెద్ద సినిమాలలో మంచి పేరు తెచ్చుకున్నాడు. చాలా కాలం తర్వాత మళ్లీ హీరోగా అవతారం ఎత్తాడు. అదే లవ్‌మౌళి సినిమా. అవనీంద్ర డైరెక్షన్‌లో నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్, సీ స్పేస్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం లవ్‌మౌళి.

ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోస్, అప్‌డేట్స్‌ కు మంచి స్పందన వస్తోంది. రీసెంట్ గా ‘ షీఈజ్‌ రియల్‌ ‘ అనే లిరికల్ వీడియో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. వింద్ వ‌సంత్ స్వ‌రాలు అందించిన ఈ చిత్రానికి అనంత్ శ్రీ‌రామ్ సాహిత్యాన్ని అందించారు. శ‌ర‌త్ సంతోష్‌, జిబా టామీ ఆల‌పించారు.


ఈ సినిమాలో నవదీప్‌ 2.0 లుక్‌ కి మంచి స్పందన వచ్చింది. ది ఏంథమ్‌ ఆఫ్‌ లవ్‌ మౌళి, టీజర్‌లకు నెట్టింట సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. షి ఈజ్ రియల్ సాంగ్ ఈ సినిమా పై నమ్మకం పెంచిందన్నారు చిత్ర దర్శకుడు అవనీంద్ర. నా లైఫ్ లో జ‌రిగిన ప్రేమ‌క‌థ‌ల‌కు ఫ‌లిత‌మే ఈ సినిమా క‌థ‌. నేను పాన్ ఇండియా లెవ‌ల్‌లో ప్రేమించేవాడ్ని. ప్రేమ అనే టాపిక్‌లో సో మెనీ వెరియేష‌న్స్ వున్నాయి. నా స్వీయ అనుభ‌వాలే ఈ సినిమా క‌థ అన్నారు ఈ ఫిల్మ్‌ డైరెక్టర్.

Related Posts