వార్నర్‌ బ్రదర్స్ సినిమాల కంటే గొప్ప సినిమా తీస్తా : చదలవాడ శ్రీనివాసరావు

రికార్డ్ బ్రేక్‌.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8 న రిలీజ్‌ చేస్తున్నారు. చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రానికి డైరెక్షన్ చేసారు. సినిమా రిలీజ్‌ దగ్గరపడుతున్న సందర్భంగా ప్రమోషన్స్‌ జోరు పెంచింది చిత్ర యూనిట్‌. మీడియాతో డైరెక్టర్‌ చదలవాడ శ్రీనివాసరావు చిత్ర విశేషాలను పంచుకున్నారు.


బిచ్చగాడు లాంటి కంటెంట్ ఉన్న సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఆ నమ్మకంతో మంచి కంటెంట్‌తో ఈసినిమాను తీసామన్నారు చదలవాడ శ్రీనివాసరావు. ఒకప్పుడు రెమ్యునరేషన్స్‌ తక్కువ ఉండేవి.. ఇప్పుడలా కాదు.. బడ్జెట్స్ పెరిగిపోయాయి.. అందుకే ఖర్చుకు వెనకాడకుండా.. క్వాలిటీ ఔట్‌పుట్ కోసం రెండేళ్ల పాటు శ్రమించామన్నారాయన.


ట్రైలర్ రిలీజయినపుడు మంచి రెస్పాన్స్ వచ్చింది.. శనివారంనాడు మీడియాకు షో వేసాం.. వాళ్లిచ్చిన స్పందన చూసి చాలా ఆనందం వేసిందన్నారు. రికార్డ్ బ్రేక్‌ అనేది యాప్ట్ టైటిల్‌ అని చెప్పడంతో పడ్డ కష్టం మర్చిపోయామన్నారు. ఈ సినిమాకి గ్రాఫిక్స్ వర్క్‌ ఎక్కువే.. ఎక్కడా రాజీపడకుండా సినిమా తీసామన్నారు చదలవాడ.


తెనాలిలో కర్రల వ్యాపారం నుంచి ఇండస్ట్రీలో ఇలా నిలదొక్కుకుని నిలబడ్డానంటే.. ఇక్కడ మంచి మిత్రులుండటం వల్లే అన్నారు. అందుకే ప్యాషన్‌తో సినిమాలు తీస్తున్నామన్నారు.
అప్పట్లో ఆర్‌.నారాయణమూర్తి గారితో కానిస్టేబుల్ వెంకట్రామయ్య తీసాను.. ఈ సినిమా చూసి మూర్తిగారు అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. రిలీజ్‌ అయ్యాక ప్రేక్షకులు కూడా అదే ఫీలవుతారన్నారు.
ఈ సినిమాని తక్కువ ధియేటర్లలో రిలీజ్‌ చేసి సక్సెస్‌ని బట్టి ధియేటర్లు పెంచుకుంటూ పోతాం.. బిచ్చగాడు విషయంలో ఇలాంటి ఫార్ములానే అమలుచేసానన్నారు. బిచ్చగాడు లో తల్లి కోసం బిడ్డ కష్టపడితే.. ఈ సినిమాలో బిడ్డల కోసం తల్లి ఏం చేస్తుందనేది కథాంశమన్నారు.


నా లైఫ్ లో పెద్ద హీరోలతో పెద్ద బడ్జెట్ సినిమాలు అస్సలు చేయను.. అలా చేయకపోవడమే నేను ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణమన్నారు చదలవాడ శ్రీనివాసరావు. నేను చిన్నస్థాయి నుంచి పైకొచ్చాను.. నాలా కష్టపడేవాళ్లకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందన్నారాయన.ఈ సినిమా ద్వారా నేను డైరెక్షన్ నేర్చుకున్న. ఈ సినిమా సక్సెస్ తరువాత మంచి టెక్నికల్ వాల్యూస్ తో వార్నర్ బ్రదర్స్ తీసే సినిమా కంటే గొప్ప సినిమా తీసి చూపిస్తా. ప్రేక్షకులందరికీ సినిమా చూసి పాస్ మార్కులు ఇస్తే డైరెక్షన్ లో ఇంకా మంచి సినిమాలు తీస్తానన్నారు డైరెక్టర్‌ చదలవాడ శ్రీనివాసరావు.

Related Posts