యాక్షన్‌ మోత మోగిస్తున్న ‘ఈగల్‌’ రిలీజ్‌ ట్రైలర్‌

రవితేజ మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ ఈగల్‌. అనుపమ పరమేశ్వరన్‌, కావ్యా థాపర్‌ ఫీమేల్ లీడ్ చేస్తున్న ఈ మూవీలో నవదీప్‌, అవసరాల శ్రీనివాస్‌ ఇతర కీరోల్స్ పోషిస్తున్నారు. కార్తీక్‌ ఘట్టమనేని డైరెక్షన్‌లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీ.జి విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 9 న రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమా రిలీజ్‌ ట్రైలర్‌ని రిలీజ్‌ చేసారు.


రవితేజ డిఫరెంట్ గెటప్‌లో యాక్షన్‌ మోత మోగించాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ , టెర్రిఫిక్ విజువల్స్‌తో ట్రైలర్‌ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. హాలీవుడ్‌ రేంజ్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్ ధ్రిల్‌ చేస్తున్నాయి.
దర్శకులు అనిల్ రావిపూడి, బాబీ, హరీష్ శంకర్‌లతో కూడిన ట్వీట్ల థ్రెడ్‌తో మేకర్స్ ఉదయం నుండి దీని కోసం చాలా ఆసక్తిని పెంచారు.

Related Posts