ఎన్టీఆర్ కు రెండో హీరోయిన్ గా గ్యాంగ్ లీడర్ బ్యూటీ..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాస్త ఆలస్యమైనా దూకుడు పెంచాడు. ఆ మధ్య వరుసగా రెండు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ లో జోష్ నింపాడు. నిజానికి 2018లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ తర్వాత మళ్లీ ఆర్ఆర్ఆర్ తోనే కనిపించాడు ఎన్టీఆర్. దీంతో అభిమానుల్లో కాస్త అసంతృప్తి ఏర్పడింది. దాన్ని పోగొట్టేందుకే ఈ సారి ఏకంగా రెండు సినిమాలు ప్రకటించాడు. అందులో మొదటిది కొరటాల శివ డైరెక్షన్ లో వస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా అలియా భట్ ను తీసుకుంటారు అనే ప్రచారం జరిగింది. కానీ అది కుదిరేలా లేదు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను ట్రై చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. బట్ ఇంకా కన్ఫార్మ్ కాలేదు. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి స్క్రీప్ట్ ఫైనల్ వర్క్ జరుగుతోంది. అన్నీ కుదిరితే వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళతారు. వచ్చే యేడాది 2023 మే 19న ఈ సినిమాను విడుదల చేయాలనే టార్గెట్ తోనే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకన్నారు. ఈలోగా కరోనా లాంటి విపత్తులేమీ రాకపోతే ఈ డేట్ కు ఖచ్చితంగా సినిమా వస్తుంది. అలాగే 2023 ఆరంభంలోనే రెండో సినిమా ప్రశాంత్ నీల్ తో మొదలవుతుంది. అయితే కొరటాల శివ సినిమాలో మెయిన్ హీరోయిన్ ఇంకా తేలలేదు కానీ.. రెండో హీరోయిన్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది.

తెలుగులో నాని హీరోగా నటించిన నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమాతో పరిచయమైన బ్యూటీ గుర్తుంది కదా..? ప్రియాంక అరుళ్ మోహన్. తర్వాత శర్వానంద్ సరసన శ్రీకారం చిత్రంలోనూ నటించింది. కానీ ఈ రెండూ పోవడంతో పాపను తర్వాతెవరూ పట్టించుకోలేదు. దీంతో తమిళ్ లో అడుగుపెట్టింది. అక్కడ ఏకంగా సూర్య సరసన ఈటీ అనే సినిమాలో నటించింది. ఈటీ ఇక్కడ ఫ్లాప్అయినా తమిళ్ లో కమర్షియల్ గా వర్కవుట్ అయింది. అలాగే శివకార్తికేయన్ తో నటించిన వరుణ్ డాక్టర్ సూపర్ హిట్ కావడంతో అమ్మడికి మంచి అవకాశాలే వస్తున్నాయి. టాలెంటెడ్ బ్యూటీగానూ పేరు తెచ్చుకున్న ప్రియాంకను ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రంలో రెండో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు.. అనేవార్తలు వస్తున్నాయి. నిజానికి తనకు ఎన్టీఆర్ సరసన మెయిన్ హీరోయిన్ గా చేసేంత స్టేచర్ ఇంకా రాలేదు. అందుకే సెకండ్ హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు అంటున్నారు. మరి ఈ ఆఫర్ కు ప్రియాంక ఓకే చెబుతుందాలేదాఅనేదిపక్కన బెడితే.. ఒకే చెబితే తనకే లాభం.ఇప్పుడు ఎన్టీఆర్ నేషనల్ వైడ్ గాఫేమ్ అయ్యాడు. ఈ ప్రాజెక్ట్ ప్యాన్ ఇండియన్ రేంజ్ లో వస్తోంది. అందుకే ఏ పాత్ర చేసినా.. తనకు ఆ రేంజ్ లోనే గుర్తింపు వస్తుంది. మరి నిజంగా ఈ కాంబో సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Related Posts