గోపీచంద్ హిట్ కొట్టాల్సిందే..

యాంగ్రీమేన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తో పాటు క్రేజ్ తెచ్చుకున్నాడు గోపీచంద్. ఒకప్పుడు అతని సినిమాలు మినిమం గ్యారెంటీ అనిపించుకున్నాయి. కానీ కొన్నాళ్లుగా మాగ్జిమం లాస్ తెస్తున్నాయి. చివరగా వచ్చిన సీటీమార్ ఫర్వాలేదు అనిపించుకున్నా.. క్లైమాక్స్ ఫైట్ తో ఇంప్రెషన్ పోగొట్టాడు దర్శకుడు. గోపీచంద్ సినిమా అంటే మాస్ కు ఫీస్ట్.కానీ అతను మాత్రం ఆ ఫీస్ట్ ను వదిలి కొత్త టేస్ట్ లు చూపిస్తానంటూ కామెడీ పీస్ లు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒకటీ రెండు సినిమాలు ఆకట్టుకున్నా.. ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు చూశాడు. ఈ ఫ్లాపుల వల్ల స్క్రీప్ట్ సెలెక్షన్ గాడి తప్పింది. అయినా వరుసగా సినిమాలు చేయడంలో మాత్రం వెనకాడ్డంలేదు. దర్శకులు, నిర్మాతలు అతనికి ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు. మరో లక్ ఏంటంటే.. గోపీచంద్ కు హిందీ డబ్బింగ్ మార్కెట్ ఓరేంజ్ లో ఉంది. ఇక్కడ తేడా వచ్చినా ఆ మార్కెట్ తో నిర్మాతలు మాగ్జిమం సేఫ్ అయ్యే అవకాశాలున్నాయి. గోపీకి నిత్యం నిర్మాతలు దొరకడానికి ఇదీ ఓ కారణమే కావొచ్చు.ఇక ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో పక్కా కమర్షియల్అనే సినిమాతో వస్తున్నాడు.

ఈ చిత్రంజూలై 1న విడుదల కాబోతోంది. రాశిఖన్నా హీరోయిన్ గా నటించగా.. సత్యరాజ్ కీలక పాత్ర పోషించాడు. రాశిఖన్నాతో ఇంతకు ముందు జిల్ అనే హిట్ మూవీ చేసి ఉన్నాడు గోపీచంద్. అందుకే ఈ కాంబినేషన్ మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందనే అనుకుంటున్నారు. అయితే ఈ పక్కా కమర్షియల్ తో గోపీచంద్ ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడిప్పుడు. ఇప్పటికే తన తరం హీరోలు ప్యాన్ ఇండియన్ మార్కెట్ అంటూ నానా హడావిడీ చేస్తున్నారు. కానీ తనింకా ఉన్న మార్కెట్ ను నిలబెట్టుకోవడానికే తంటాలు పడుతున్నాడు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ చూస్తే రెగ్యులర్ ఎంటర్టైనర్ లాగానే కనిపిస్తుంది. గోపీచంద్ ఫ్యాన్స్ ఆశించే అంశాలేవీ పెద్దగా కనిపించడం లేదు. ట్రైలర్ లో కనిపించిన తండ్రి కొడుకుల కాన్ ఫ్లిక్ట్ కూడా కొత్తదేం కాదు. ఆల్రెడీ యూనీఫామ్ మార్చిన పటాస్ లాగా కనిపిస్తోంది. అయినా మారుతి మార్క్ మ్యాజిక్ ఏదైనావర్కవుట్అయితే తప్ప ఈ మూవీ హిట్ అనిపించుకోదు.ఇక జూలైలో విడుదలైన గోపీచంద్ సినిమాలు హిట్ అయ్యాయి అనే సెంటిమెంట్ ను బయటకు తెస్తున్నారు కొందరు. గతంలోనిజమే కావొచ్చు. కానీ ఎప్పుడూ అదే జరగదు కదా..? అయినా సెంటిమెంట్స్ కు హిట్స్ రాలతాయా..?

Related Posts