‘దేవర‘ పోస్ట్ పోన్? రంగంలోకి ‘ది ఫ్యామిలీ స్టార్‘

వేసవి కానుకగా ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదల తేదీ ఖరారు చేసుకుంది యంగ్ టైగర్ మోస్ట్ అవైటింగ్ మూవీ ‘దేవర‘. అయితే.. విలన్ పాత్రధారి సైఫ్ ఆలీ ఖాన్ గాయపడడం, అనిరుధ్ రవిచందర్ అనుకున్న సమయానికి పాటలను ఇవ్వకపోవడం వంటి కారణాలతో ఈ చిత్రం వాయిదా పడే అవకాశాలున్నట్టు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. చివరకు ఇప్పుడు అదే నిజమైంది.

‘దేవర‘ వాయిదా పడితే.. అదే సమయానికి తమ ‘ఫ్యామిలీ స్టార్‘ను రంగంలోకి దింపుతామని దిల్ రాజు తెలిపిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ ‘ది ఫ్యామిలీ స్టార్‘ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ‘దేవర‘కి అనుకున్న ఏప్రిల్ 5నే ‘ది ఫ్యామిలీ స్టార్‘ థియేటర్లలోకి దిగబోతుంది. వేసవితో పాటు ఉగాది పర్వదినం కూడా కలిసి రావడంతో ఆ డేట్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ‘గీత గోవింతం‘ వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

Related Posts