‘యాత్ర 2‘ సాంగ్.. ఎమోషనల్ గా ‘చూడు నాన్న‘ గీతం

విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రచారంలో స్పీడు పెంచింది ‘యాత్ర 2‘ టీమ్. ఇప్పటికే మంచి విజయాన్ని సాధించిన ‘యాత్ర‘ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. మొదటి భాగంలో దివంగత వై.ఎస్.ఆర్ పాదయాత్రను ఆవిష్కరించిన డైరెక్టర్ మహి వి.రాఘవ్.. సీక్వెల్ లో జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను హైలైట్ చేయబోతున్నాడు.

ఇప్పటికే టీజర్ తో అంచనాలు పెంచేసిన ‘యాత్ర 2‘ నుంచి లేటెస్ట్ గా ‘చూడు నాన్న‘ అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ రిలీజయ్యింది. వై.ఎస్.ఆర్ మరణం తర్వాత జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర నేపథ్యంలో ఈ పాట ఉంది. జనసందోహం మధ్య అధ్బుతంగా చిత్రీకరించిన ఈ గీతం హృద్యంగా ఆకట్టుకుంటోంది. ఈ పాట మధ్యలో జగన్ పాత్రధారి ప్రజలతో మమేకమైన సమయంలో ‘దేవుడు నమ్మకం అన్న.. వై.ఎస్.ఆర్ నిజం‘ అంటూ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. సంతోష్ నారాయణన్‌ సంగీతంలో భాస్కరభట్ల రాసిన ఈ గీతాన్ని విజయ్ నరేన్ ఆలపించాడు. వై.ఎస్.ఆర్ గా మమ్ముట్టి కనిపించబోతున్న ఈ మూవీలో జగన్ గా జీవా నటిస్తున్నాడు. త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘యాత్ర 2‘ ఫిబ్రవరి 8న విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts