షారుక్, సంజయ్ లీల భన్సాలీ కాంబోలో ‘ఇన్షా అల్లా‘

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. పోయినేడాది షారుక్ నుంచి వచ్చిన ‘పఠాన్, జవాన్‘ చిత్రాలు భారీ విజయాలు సాధించగా.. ‘డంకీ‘ ఫర్వాలేదనిపించింది. ఇదే ఊపులో ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీస్ ను లైన్లో పెడుతున్నాడు. బాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీతో షారుక్ సినిమా చేయబోతున్నాడట.

షారుక్, సంజయ్ లీల భన్సాలీ కాంబోలో ‘దేవదాస్‘ సినిమా వచ్చింది. 2002లో వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. మళ్లీ 22 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా రూపొందనుందట. ఈ చిత్రానికి ‘ఇన్షా అల్లా‘ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అసలు ఈ సినిమాని ముందుగా సల్మాన్ ఖాన్ తో చేద్దామనుకున్నాడు భన్సాలీ. ఇప్పుడీ ప్రాజెక్ట్ షారుక్ చెంతకు వచ్చింది. వయసు మళ్లిన హీరో, అతడి కన్నా చిన్న వయసున్న అమ్మాయితో ప్రేమలో పడే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కనుందట. త్వరలోనే.. ఈ మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్టు తెలుస్తోంది.

Related Posts