‘ఈగల్‘ సోలో రిలీజ్ కోసం ఛాంబర్ కి లేఖ రాసిన పీపుల్ మీడియా

సంక్రాంతి స్లాట్ ను త్యాగం చేసి.. ఫిబ్రవరిలో సోలో రిలీజ్ కు ప్లాన్ చేసుకుంది మాస్ మహారాజ రవితేజ ‘ఈగల్‘. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాని ఫిబ్రవరి 9న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే.. ఫిబ్రవరి రెండో వారంలో సినిమాల జోరు మామూలుగా లేదు. ఒకటి తర్వాత మరొకటిగా ఫిబ్రవరి 8, 9 తారీఖుల్లో వరుస సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. గతంలో సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘ఈగల్‘ విడుదల తేదీ ఖరారు చేసుకుందని.. అప్పట్లో ఛాంబర్ తమ సినిమాని వాయిదా వేయంటేనే వేశామని.. ఈ లెటర్ లో పేర్కొంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ సందర్భంగా ఛాంబర్ తమకు సోలో రిలీజ్ ఇస్తామని హామీ ఇచ్చిందని లెటర్ లో తెలిపారు. ఇక.. ఫిబ్రవరి 9న ‘ఈగల్‘ వస్తోన్న టైమ్ కే ‘యాత్ర 2, లాల్ సలామ్, ఊరు పేరు భైరవకోన‘ వంటి సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. మరి.. ‘ఈగల్‘ సోలో రిలీజ్ హామీపై ఛాంబర్ ఏమంటుందో చూడాలి.

Related Posts