ఆ హీరో ఓవరాక్షన్ తగ్గిస్తారా లేదా..?

ప్రతి హీరోకూ ఓ స్టైల్ ఉంటుంది. ఆ హీరోకు స్టార్డమ్ వచ్చిన తర్వాత తమ ఫ్యాన్స్ కు ఎలా ఉంటే నచ్చుతుందో అలా చేయడం మొదలుపెడతారు. దీనికి స్థానికత కూడా యాడ్ అవుతుంది. అంటే ప్రతి భాషకూ కొన్ని అంశాలుంటాయి కదా.. అవి అన్నమాట. అలా చూస్తే సౌత్ లోని నాలుగు భాషల సినిమాల హీరోలకూ నాలుగు రకాల మేనరిజమ్స్ కనిపిస్తాయి. ఈ నాలుగు పరిశ్రమల్లోనూ కాస్త అతిగా, ఓవరాక్షన్ అనిపించే సినిమాలు తమిళ్ లోనే ఎక్కువగా వస్తాయి. అక్కడ సూపర్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ ఉన్న విజయ్ కి కూడా దీనికి అతీతం కాదు. అక్కడ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అతని సినిమాలు తెలుగులో అస్సలు చూడలేం. అంత ఓవరాక్షన్ ఉంటుంది. మరి ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు కదా.. ఇప్పుడు కూడా ఈ అతి కనిపిస్తుందా లేక కట్ చేస్తారా అనేది టాలీవుడ్ హాట్ డిస్కషన్ గా మారింది.
నిజానికి విజయ్ వ్యక్తిగతంగా చాలా కామ్ గానే ఉంటాడు. కానీ తమిళ్ ప్రేక్షకుల టేస్ట్ కు, అభిమానుల కోసం అతి చేయక తప్పదు. అలా చేస్తేనే వారికి నచ్చుతుంది. చాలా చిన్న సినిమాల్లో కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది. కానీ తెలుగులో ఇది కుదరదు. మన దగ్గర ఫైట్స్ భారీగా ఉంటాయి కానీ ఎమోషన్స్ మాత్రం బ్యాలన్స్ డ్ గానే ఉంటాయి. ఆ బ్యాలన్స్ ను విజయ్ విషయంలోనూ చూపించాలి. కాదూ కూడదు అంటే తమిళ్ ప్రేక్షకుల కోసం అక్కడి వరకే ఆ మేనిరిజమ్స్ ఉంచి.. తెలుగులో మాత్రం కట్ చేయాల్సి ఉంటుంది. అంటే అన్నీ కాకపోయినా కొన్ని సీన్స్ అయినా రెండుసార్లు చేయాలి. మరి దీనికి విజయ్ ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి.
మరో విషయం ఏంటంటే.. ఈ మధ్య కాలంలో విజయ్ సినిమాల్లో కాస్త ఈ అతి తగ్గిందనే చెప్పాలి. ఆ తగ్గడం పూర్తిగా తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా ఉంటే ఇంక చెప్పేదేముందీ.. ఈ ఇళయదళపతి తెలుగు వారిని కూడా మెప్పిస్తాడు. మరి ఈ ఓవరాక్షన్ విషయంలో దర్శకుడు కంటే ఎక్కువగా నిర్మాత దిల్ రాజే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందేమో..

Related Posts