సాయి పల్లవికి ఆంధ్ర దర్శకులంటే పడదా..?

సాయి పల్లవి.. ఫిదా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసి.. ఏకంగా తెలుగమ్మాయే అనిపించుకుంటోంది. వరుసగా తెలుగులోనే సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటోంది. తనుంటే సినిమా హిట్ అనేంత ముద్రను అతి తక్కువ టైమ్ లోనే వేసింది. గ్లామర్ కు దూరంగా.. వైవిధ్యమైన కథలకు దగ్గరగా జర్నీ చేస్తోన్న ఈ డాక్టర్ పిల్ల.. ఈ విషయంలో తను సింగిల్ పీస్ నే అనిపించుకుని అవతలి హీరోయిన్లను కూడా కుళ్లుకునేలా చేస్తోంది. ప్రస్తుతం తను ప్రధాన పాత్రగా నటించిన విరాటపర్వం ఈ నెల 17న విడుదలకు సిద్దంగా ఉంది. ఆ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అమ్మడు ఓ విషయంలో సర్ ప్రైజింగ్ న్యూస్ చెప్పింది. తను టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఒక్క ఆంధ్ర దర్శకుడితో కూడా పనిచేయలేదు. కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. అమ్మడు ఇప్పటి వరకూ తెలుగులో ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయ్, పడి పడి లేచె మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ తో పాటు విరాటపర్వం సినిమాల్లో నటించి ఉంది.. ఈ మొత్తం సినిమాలకు దర్శకత్వం చేసింది తెలంగాణ దర్శకులే కావడం విశేషం.
ఫస్ట్ మూవీ ఫిదా, లవ్ స్టోరీల దర్శకుడు శేఖర్ కమ్ముల బర్త్ ప్లేస్ నల్గొండ. హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు. తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి దర్శకుడు వేణు శ్రీరామ్ జగిత్యాలకు చెందిన వాడు. అలాగే పడిపడిలేచె మనసు చిత్రానికి హను రాఘవపూడి డైరెక్టర్. ఇతను ఖమ్మం జిల్లా కొత్తగూడేనికి చెందిన వాడు. అలాగే శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ హైదాబాద్ వాసి. సో.. యాదృఛ్ఛికమా లేక ఇంకేదైనా రీజన్ ఉందా అనేది చెప్పలేం కానీ అమ్మడు ఇప్పటి వరకూ కేవలం తెలంగాణ ప్రాంతానికి చెందిన దర్శకులతోనే పనిచేయడం విశేషం. మరి ఈ కారణంగానేనేమో.. తనకు కాస్త పద్ధతైన అలవాట్లు వచ్చాయి. పైగా ఈ దర్శకులంతా సక్సెస్ ఫెయిల్యూర్స్ తో పనిలేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఓ మంచి అభిప్రాయాన్ని సంపాదించుకున్నవాళ్లే కావడం మరో విశేషం.
మొత్తంగా సాయి పల్లవి కెరీర్ లో ఇప్పటి వరకూ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన దర్శకులు పడలేదు. ప్రస్తుతం తను గార్గి అనే తమిళ్ సినిమా చేస్తోంది. ఇది ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అంటున్నారు. తమిళ్, తెలుగు, మళయాలం వరకూ ఓకే కానీ ఏకంగా ప్యాన్ ఇండియా అంటే అంత సీన్ తనకు ఉందా అనేది పెద్ద ప్రశ్నే. పైగా ఆ మధ్య కణం అనే సినిమా కూడా ఇలాగే మల్టీ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తే ఎవరూ ఎక్కడా పట్టించుకోలేదు.

Related Posts