సెకండ్ వీక్ వార్ లో విన్నర్ ఎవరు.. ?

స్టార్స్ మధ్య వార్ అనేది చూసే వారికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నా.. తీసిన వారికి మాత్రం టెన్షన్ గా ఉంటుంది. ఎందుకంటే చరిత్రే కాదు.. పరిశ్రమ కూడా విజేతలనే పట్టించుకుంటుంది కాబట్టి.. వచ్చే శుక్రవారం గని మాత్రమే ఉంది. ఆ తర్వాత వారం మాత్రం సూపర్ వార్ కు వేదిక కాబోతోంది. బీస్ట్, కెజీఎఫ్ లతో పాటు మరో పెద్ద సినిమా కూడా వచ్చేస్తోంది. కాకపోతే ఆ మూవీ తెలుగులో రాదు. అయినా దేశవ్యాప్తంగా ఉండే పోటీలో నిలబడుతుంది కదా..? మరి ఈ మూడు సినిమాల మధ్య వార్ ఎలా ఉండబోతోంది.. బాక్సాఫీస్ బరిలో విజేతలగా నిలిచేదెవరు..?
తమిళ్ సూపర్ స్టార్ గా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ హీరో విజయ్. ఇళయదళపతిగా ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే విజయ్ సినిమా అంటే అక్కడ మాగ్జిమం గ్యారెంటీ. కంటెంట్ వీక్ గా ఉన్నా కలెక్షన్స్ మాత్రం స్ట్రాంగానే ఉంటాయి. కాకపోతే తెలుగులో ఆ రేంజ్ మార్కెట్ లేదు విజయ్ కి. ఈ మధ్యే కొంత మార్కెట్ పెరిగింది. ఆ మార్కెట్ కోసమే తెలుగులోనూ బీస్ట్ ను విడుదల చేస్తున్నారు. ఈ నెల 13న వస్తోన్న బీస్ట్ ను తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేస్తుండటం విశేషం. అయితే తనతో పాటు కెజీఎఫ్ చాప్టర్ 2 రూపంలో భారీ పోటీ ఉన్నా.. ఎందుకో ఈ చిత్రానికి సంబంధించి తెలుగులోనే కాదు.. తమిళ్ లో కూడా ప్రమోషన్స్ పరంగా చాలా వెనకబడి ఉన్నారు.
ఏప్రిల్ 14న కెజీఎఫ్ రెండో చాప్టర్ వస్తోంది. ఫస్ట్ పార్ట్ బిగ్గెస్ట్ హిట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. దేశవ్యాప్తంగా కెజీఎఫ్ కు ఇప్పుడు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ మూవీతో శాండల్ వుడ్ క్రేజ్ ను ప్రపంచానికి పరిచయం చేశారు.. దర్శకుడ ప్రశాంత్ నీల్, హీరో యశ్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సారి స్టార్స్ కూడా పెరిగారు. నార్త్ ఆడియన్స్ కోసం సంజయ్ దత్ ను విలన్ గా తీసుకున్నారు. అలాగే నిన్నటి తరం బ్యూటీఫుల్ హీరోయిన్ రవీనాటాండన్ ఓ కీలక పాత్రలో నటించింది.
అయితే కెజీఎఫ్ లాంటి సునామీకి ఎదురెళ్లేందుకు బ్యాట్ ఎత్తిన సినిమా జెర్సీ. ఎప్పటి నుంచో సరైన రిలీజ్ డేట్ కోసం చూస్తోన్న హిందీ జెర్సీ మూవీని కూడా ఏప్రిల్ 14నే విడుదల చేస్తున్నారు. తెలుగులో నాని హీరోగా నటించిన ఈ సూపర్ హిట్ చిత్రాన్ని హిందీలోనూ గౌతమ్ తిన్ననూరే డైరెక్ట్ చేశారు. సితార బ్యానర్ తో పాటు దిల్ రాజు, అల్లు అరవింద్ అక్కడ నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. అక్కడ కూడా జెర్సీపై అంచనాలున్నా.. వీళ్లు కెజీఎఫ్ హవాను ఎంత వరకు తట్టుకుంటారు అనేది పెద్ద ప్రశ్న.
ఇక ఈ మూడు చిత్రాల్లో మాగ్జిమం ఆడియన్స్ కెజీఎఫ్ కోసం చూస్తున్నారని చెప్పొచ్చు. అయితే తమిళ్ లో విజయ్ ని దాటి కెజీఎఫ్ సత్తా చాటడం మాత్రం చాలా పెద్ద టాస్క్. అలాగే బీస్ట్ ఇతర భాషల్లో కెజీఎఫ్ ను బీట్ చేయడం ఇంపాజిబుల్. పైగా బీస్ట్ ట్రైలర్ కు అంత గొప్ప రెస్పాన్సేం రాలేదు. దీనికి తోడు ప్రమోషన్స్ పరంగా చాలా వీక్ గా ఉంది. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ప్రమోషన్స్ వీక్ గా ఉన్నా స్టార్ హీరోకు సమస్య లేదు. కానీ ఎదురుగా ఉన్న పోటీ చాలా పెద్దది కదా..? మొత్తంగా నార్త్ లో కెజీఎఫ్ వర్సెస్ జెర్సీ గా ఉంటే.. సౌత్ లో కెజీఎఫ్ వర్సెస్ బీస్ట్ గా ఈ స్టార్ వార్ జరగబోతోంది. మరి వార్ లో విన్నర్ ఎవరనేది ఎవరైనా సులువుగానే ఊహించొచ్చు.

Related Posts