కన్నడ కస్తూరి రష్మిక మందన్నా పుట్టిన రోజు ..

హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలంటే అందంతో పాటు టాలెంట్ కూడా ఉండాలి. ఈ రెండింటికి లక్ కూడా యాడ్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే హీరోయిన్ టాప్ పొజిషన్ కి చేరుకుంటుంది. ఈ మూడు ఉన్న హీరోయిన్ రష్మిక. కన్నడలో కెరీర్ స్టార్ట్ చేసి తెలుగులో టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరిన రష్మిక మందన్నా బర్త్ డే ఇవాళ. ఈ సందర్బంగా క్యూట్ బ్యూటీ రష్మికపై స్పెషల్ స్టోరీ చూద్దాం.
కన్నడ బ్యూటీ రష్మిక కిరిక్ పార్టీతో శాండిల్ వుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో పాటు అక్కడ యూత్ లో రష్మికకి ఫాలోయింగ్ పెంచింది. దీంతో వరుసగా కన్నడ స్టార్స్ తో సిసనిమాలు చేసే ఛాన్స్ కూడా వచ్చింది. ఆ మరుసటి ఏడాదే నాగశౌర్య హీరోగా వచ్చిన చలో మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది రష్మిక. ఈ చిత్రంలో తన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది… సూపర్ హిట్ అందుకుంది.
తెలుగులో రష్మికకి గుర్తింపు పెరగడానికి కారణం గీతా గోవిందం సినిమా. ఆమెకు టాలీవుడ్లో ఇది సెకండ్ మూవీనే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలోనూ రష్మిక పెర్ఫార్మెన్స్, గ్లామర్ యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ సాగే సీన్స్ లో రష్మిక పెర్ఫార్మెన్స్ యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్ తో రష్మికకి తెలుగులో అవకాశాలు కూడా పెరిగాయి.
చలో, గీతా గోవిదం వంటి హిట్స్ తో ఒక్కసారిగా ఇమేజ్ పెంచుకున్న రష్మికకు… ఆ తర్వాత దేవదాస్, డియర్ కామ్రేడ్ చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. ఇక ఆ తర్వాతి సంవత్సరం….అంటే లాస్ట్ ఇయర్ రెండు సూపర్ హిట్స్ కొట్టింది. వాటిల్లో మహేష్ కి జోడీగా నటించిన సరిలేరు నీకెవ్వరు ఒకటి. ఈ చిత్రంలో అల్లరి పిల్లగా కనిపించి మెప్పించింది. అలాగే నితిన్ హీరోగా వచ్చిన భీష్మతోనూ మంచి విజయాన్ని అందుకుంది. గత ఏడాది కన్నడలో పొగరు సినిమా చేసింది. అదే టైమ్ లో కార్తీకి జోడీగా నటించి సుల్తాన్ చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ రెండు సినిమా యావరేజ్ ఫలితాన్ని మాత్రమే అందుకున్నాయి. అయితే ఇయర్ ఎండింగ్ లో తెలుగులో వచ్చిన పుష్ప మాత్రం రష్మికకి అదిరిపోయే హిట్ ని ఇచ్చింది. పాన్ ఇండియా లెవల్లో రిలీజైన పుష్ప విడుదలైన అన్ని బాషల్లో సక్సెస్ అయ్యింది. మరీ ముఖ్యంగా హిందీలో సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో కాస్త డీ గ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది రష్మిక.
రష్మిక ఈ ఏడాది ఆరంభంలో శర్వానంద్ కి జోడీగా నటించిన ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే చిత్రంతో వచ్చింది. కానీ ఆ మూవీ సక్సెస్ కాలేదు. మరోవైపు హిందీలో అమితాబ్ బచ్చన్ తో కలసి గుడ్ బై అనే మూవీలో నటించింది. ఇదే బాలీవుడ్లో తనకు ఫస్ట్ మూవీ. ఈ సినిమా రిలీజ్ కాకుండానే హిందీలో యంగ్ హీరో సిద్దార్ధ మల్హోత్రాతో మిషన్ మజ్ను పేరుతో సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలతో హిందీలో సక్సెస్ అవ్వాలనుకుంటోంది రష్మిక. ఇక బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సీక్వెల్ లోనూ రష్మిక నటించబోతుంది. అలాగా రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కే మూవీలో రష్మికనే హీరోయిన్ అనే టాక్ ఉంది. సో..ఇలా వరుసగా భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ అన్ని బాషల ఆడియన్స్ ని మెప్పించేందుకు ప్రయత్నిస్తున్న రష్మికకు మరోసారి బర్త్ డే విషెస్ అందిద్దాం.

Image

Image

Image

Image

Image

Image

Related Posts