తీన్మార్ లో టాప్ గేర్ ఎవరిది..?

జూన్ 3న అంటే రేపు మూడు భారీ చిత్రాలు విడుదలవుతున్నాయి. అది కూడా పాన్ ఇండియా లెవల్లో. ఆ సినిమాల్లో మేజర్ ఒకటి. అడవి శేష్, సయూ మంజ్రేకర్, శోభితా ధూళిపాల హీరో హీరోయిన్లుగా నటించారు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో వహించిన ఈ చిత్రాన్ని హీరో మహేష్ బాబుకి చెందిన జి.ఎమ్.బి మూవీస్, సోనీ పిక్చర్స్ సంస్థ కలసి నిర్మించాయి. 2008లో ముంబయి ఉగ్రదాడుల నేపథ్యంలో మేజర్ మూవీని రూపొందించారు. ఈ దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథే ఈ సినిమా. ఉన్ని కృష్ణన్ పాత్రలోనూ అడవి శేష్ నటించాడు. తన ప్రేయసిగా సయీ మంజ్రేకర్ నటించారు. ఇప్పటికే ఈ సినిమాకి ప్రీమియర్ షోస్ వేసి దేశవ్యాప్తంగా సినిమాపై క్రేజ్ ని పెంచుతున్నారు. అలాగే ట్రైలర్, సాంగ్స్ తో మేజర్ పై తెలుగు, మలయాళంతో పాటు హిందీలోనూ అంచనాలు పెరిగాయి.

తమిళంలో తెరకెక్కి తెలుగు, మలయాళ, హిందీ బాషల్లో విడుదలవుతున్న క్రేజీ మూవీ విక్రమ్ కూడా రేపే విడుదలవుతోంది. యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ నటించిన సినిమా కావడం, దానికి ఖైదీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ కావడం ఆడియన్స్ లో విక్రమ్ పై అంచనాలు పెరగడానికి కారణంగా చెప్పొచ్చు. అలాగే విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించడం విక్రమ్ మూవీపై అంచనాలను రెట్టింపుచేసింది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంచనాలున్న కారణంగా విక్రమ్ కి అడ్వాన్స్ బుక్కింగ్స్ కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నాయి.

అక్షయ్ కుమార్ నటించిన హిస్టారికల్ మూవీ ఫృధ్వీరాజ్ కూడా రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అన్ని దక్షిణాది బాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. భారత చరిత్రంలో వీరుడుగా పేరున్న చక్రవర్తి ఫృధ్వారాజ్ చౌహన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. భారీ సెట్స్ వేసి ఈ సినిమాని తెరకెక్కించారు. అలాగే గ్రాఫిక్స్ కూడా ఎక్కువగా ఉపయోగించారని తెలుస్తోంది. వార్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ని బాగా మెప్పిస్తాయనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్.
మేజర్, విక్రమ్, ఫృద్వీరాజ్… వేటికవే సెపరేట్ జానర్లలో తెరకెక్కాయి. మేజర్ యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కింతే, విక్రమ్ గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్. ఇక పృధ్వీరాజ్ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా. అందుకే ఈ సినిమాలకు అన్ని బాషల్లోనూ ఆడియన్స్ నుంచి పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. అడ్వాన్స్ బుక్కింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. అంచనాలు కూడా ఉన్నాయి. మరి రేపు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యాక, ఏ సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి…

Related Posts