ad

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికి’. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కాబోతోంది. తెలుగుతో పాటు అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. మళయాల బ్యూటీ నజ్రియా నజ్రీన్ ఫస్ట్ టైమ్ తెలుగులో హీరోయిన్ గా నటించిన మూవీ ఇది. నాని తన కెరీర్ లో ఇప్పటి వరకూ చేయని పాత్ర చేసినట్టుగా ఈ టీజర్ తో పాటు సాంగ్స్ చూసినప్పుడు అర్థమైంది. ఓ హిందూ అబ్బాయి, క్రిస్టియన్ అమ్మాయి ప్రేమించుకుంటే.. అదీ వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారైతే ఎలా ఉంటుంది అనే కోణంలో సాగే సినిమా ఇది. ఈ తరహాలో గతంలో కొన్ని కథలు వచ్చినా.. క్రిస్టియన్ అమ్మాయి యాంగిల్ లో తెలుగులో చాలా తక్కువే. అందుకే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మారింది. మరోవైపు సందేశాలేం లేకుండా కేవలం ఎంటర్టైనింగ్ గానే ఈ చిత్రాన్ని రూపొందించామని మూవీ టీమ్ చెబుతోంది. వివేక్ సాగర్ సంగీతంలో వచ్చిన పాటలూ బావున్నాయి. అన్నిటికీ మించి తెలుగులో సోలో రిలీజ్ డేట్ దొరికింది అనే ఆనందంలో ఉన్నారు. కానీ వీరికి గుర్తుందో లేదో.. అదే రోజు ప్రపంచం మొత్తం అభిమానులున్న ఓ భారీ హాలీవుడ్ సినిమా కూడా విడుదలవుతోంది. అంటే సుందరానికి భారీ పోటీయే ఉంది.

మూడు దశాబ్దాల క్రితం ప్రపంచం మొత్తాన్ని అబ్బురపరిచిన చిత్రం జురాసిక్ పార్క్. వేల యేళ్ల క్రితం ఈ భూమ్మీద బ్రతికి ఉన్నాయనుకుంటోన్న డైనోసార్స్ నేపథ్యంలో వచ్చిన ఈ కథకు వయసులతో సంబంధం లేకుండా ప్రపంచ సినీ ప్రేక్షకులంతా దాసోహం అయిపోయారు. స్టీవెన్ స్పీల్ బర్గ్ సృష్టించిన ఈ కొత్త ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వినోదాత్మకంగా విహరించారు. ఆ తర్వాత ఆ సిరీస్ లో మరికొన్ని సినిమాలు వచ్చాయి. అన్ని విజయం సాధించాయి. ఇప్పుడు మరో సినిమా ‘జురాసిక్ వరల్డ్ డామినేషన్’ పేరుతో జూన్ 10న విడుదల కాబోతోంది. కోలిన్ ట్రెవోరో డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటి వరకూ వచ్చిన చిత్రాల స్థాయికి ఇంకా మించే ఉంటుంది అనేలా కనిపిస్తున్నాయి విజువల్స్. ఖచ్చితంగా ఇండియాలో ‘జురాసిక్ వరల్డ్ డామినేషన్’ కూ మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ రిలీజ్ టైమ్ కు ఇంకా పెరిగితే తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లో కూడా ఇబ్బంది తప్పదు. తప్పాలి అంటే ఇప్పటిలా కాక ప్రమోషన్స్ లో జోరు పెంచాలి.. ఆ ప్రమోషన్స్ తో ఆడియన్స్ అటెన్షన్ ను డబుల్ రేంజ్ లో సంపాదించాలి. ఏదేమైనా అంటే సుందరానికి గట్టి పోటీయే ఉందంటున్నారు మరి.

, , , , ,