విజయ్ 69 కి డైరెక్టర ఎవరు?

తమిళ దళపతి విజయ్ త్వరలో పూర్తిస్థాయి రాజకీయాలతో బిజీ కాబోతున్నాడు. ప్రస్తుతం తన 68వ చిత్రాన్ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా తర్వాత తన 69వ సినిమాని తెలుగు నిర్మాణ సంస్థ డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ లో చేయబోతున్నాడు. ఇదే విజయ్ నటించే చివరి సినిమా అవ్వొచ్చనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.

పొలిటికల్ ఎంట్రీ ఇస్తుండడంతో తన 69వ సినిమాని కూడా పూర్తి స్థాయి రాజకీయ చిత్రంగా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడట విజయ్. ఈ సినిమాతో తన మానిఫెస్టోని ప్రజలకు చేరువ చేసేలా.. తన పార్టీకి ఉపయోగపడేలా.. ప్రజలకు సందేశాన్ని కూడా అందించాలనే ఆలోచనలో ఉన్నాడట. పూర్తిస్థాయి సందేశాత్మకంగా తెరకెక్కే విజయ్ 69 కోసం ఇప్పుడు పలువురు దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

విజయ్ 69 కోసం డైరెక్టర్ శంకర్ తో పాటు.. అట్లీ, వెట్రిమారన్, కార్తీక్ సుబ్బరాజ్, హెచ్.వినోద్ వంటి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మరి.. వీరిలో ఎవరితో విజయ్ 69 ఉంటుందనేది మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది. మరోవైపు.. 2026లో రాబోయే తమిళనాడు సాధారణ ఎన్నికల్లో విజయ్ తన పార్టీని పోటీకి దింపబోతున్నాడు.

Related Posts