NBK 109.. సగభాగం చిత్రీకరణ పూర్తైంది!

బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం NBK 109. బాలకృష్ణ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని.. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు బాబీ. ఇటీవలే ఈ సినిమా ఊటీలో ఓ లెందీ షెడ్యూల్ మొదలుపెట్టుకుంది. అయితే.. అనుకున్న సమయానికంటే ముందే ఊటీ షెడ్యూల్ ని ఫినిష్ చేసిందట టీమ్. అక్కడ వాతావరణం సహకరించకపోవడమే అందుకు కారణంగా చెప్తున్నారు.

ప్రస్తుతం NBK 109 టీమ్ హైదరాబాద్ చేరుకుంది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం రాజమండ్రి వెళ్లబోతున్నారనేది చిత్రబృందం నుంచి అందుతున్న సమాచారం. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలకృష్ణకి జోడీగా ఎవరు నటిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.

ఈ మూవీలో కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కనిపించబోతుంది. మరో కీ రోల్ లో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణకు దీటైన విలన్ గా బాబీ డియోల్ అలరించబోతున్నాడు. మొత్తంగా.. ఇప్పటివరకూ NBK 109 సగభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాని ఈ ఏడాదే విడుదలకు ముస్తాబు చేస్తున్నారు.

Related Posts