విజయ్ దేవరకొండ విషయంలో వివాదం చేస్తున్నది ఎవరు..?

ఎన్ని ఎత్తులకు ఎదిగినా మొదటి మెట్టును మర్చిపోకూడదు అని చెబుతుంటారు పెద్దలు. ఆ విషయం విజయ్ దేవరకొండకు తెలియదా లేక తెలిసీ అలా బిహేవ్ చేశాడా అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం. ఎందుకంటే అతనేం చేశాడు అనేది అందరికీ తెలిసినా.. చేసిన సందర్భం ఏంటీ అనేది కొందరికే తెలుసు. ఈ కారణంగానే ఇప్పుడు అతని క్యారెక్టర్ కు సోషల్ మీడియా వేదికగా డ్యామేజ్ జరుగుతోంది. దీనికి తోడు మనోడు మొదటి నుంచి కాస్త అతి ఉత్సాహంగానే కనిపిస్తాడు. అది అతని స్వభావం అని అతన్ని దగ్గరగా చూసిన వారికి తెలుసు. కానీ ఎంతమంది అంత దగ్గరగా చూసే అవకాశం ఉందీ అంటే చాలా తక్కువ శాతం మాత్రమే ఉంటారు. ఈ కారణంగానే అతని చర్యలు విపరీతంగా కనిపిస్తున్నాయి. పైగా పబ్లిక్ ప్లేస్ లో ప్రవర్తించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలోనూ తనదైన శైలిలోనే ప్రవర్తించాను కదా అనుకున్నాడు విజయ్ దేవరకొండ. పైగా తన ముందున్న వారందరికీ తను తెలుసు కాబట్టి.. ఏ సమస్యా ఉండదు అనుకున్నాడు. నిజానికి అక్కడి వారితో ఏ సమస్య లేదు.

ఎందుకంటే వారందరికీ అతనేంటో తెలుసు. ఇప్పుడు సమస్యల్లా ఇతర జనం నుంచే..ఎంత కాదనుకున్నా ఇప్పుడు విజయ్ దేవరకొండ రేంజ్ మారింది. అతి తక్కువ టైమ్ లోనే ప్యాన్ ఇండియన్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో అతనికి ఓ రేంజ్ క్రేజ్ వచ్చింది. ఆ ప్రాంతాల్లో ఒక్క సినిమా కూడా చేయకుండానే ఈ క్రేజ్ రావడానికి కారణం ఎవరో అందరికీ తెలుసు. కానీ ఆ టార్గెట్ గానే వెళ్లిన వీరికి ఇదేమంత పెద్ద విషయంగా కనిపించదు. కానీ పోటీ ప్రపంచంలో అతన్ని పోటీగా భావించే వారికి పెద్ద ఇష్యూనే. అంచేత ఆ వర్గం వాళ్లు ఇలా చేయిస్తున్నారు అనుకుంటున్నారు కొందరు. బట్ కానే కాదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ విషయంలో విపరీతమైన కమెంట్స్ చేస్తున్నవారంతా అతని అస్సలు తెలియని వారు మాత్రమే.


సోషల్ మీడియాలో చాలామంది మేధావులుంటారు. వారికి సినిమాల పై మంచి అభిప్రాయం ఉండదు. అలాగే సినిమా నటులపై. ఇంకో బ్యాచ్ లో కుల ప్రస్తావనా వస్తుంది. ఈ రెండు అంశాల్లోనూ విజయ్ దేవరకొండ అందరికీ దొరికిపోయేలా కనిపించాడు. అందుకే మూడో వర్గం ప్రజల నుంచి అతనికి వ్యతిరేకత వస్తోంది. ఇది నిజం. సోషల్ మీడియాలో చూస్తే ఏ ఇతర హీరోల అభిమానులూ విజయ్ ఏం అనడం లేదు. అలాగే సినిమా పరిశ్రమలోని వారు కానీ.. రెగ్యులర్ మూవీ లవర్స్ కానీ అతని ప్రవర్తనను తప్పు పట్టడం లేదు. బట్.. సినిమా పరిశ్రమ పై సరైన అభిప్రాయం లేని వారు మాత్రం వ్యక్తిత్వం అజెండాగా ఏకి పడేస్తున్నారు. వాళ్లు అలా చేయడం కరెక్టా కాదా అనేది పక్కన బెడితే.. విజయ్ దేవరకొండ కూడా తన ప్రవర్తనను మార్చుకోవాల్సిన టైమ్ వచ్చిందనేది నిజం.ఎంత మంచి వ్యక్తిత్వం మనకు ఉన్నా.. పబ్లిక్ ఫిగర్ గా ఉన్నప్పుడు.. పబ్లిక్ లో ప్రవర్తిస్తున్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగానే ఉండాలి. లేదంటే ఇలాంటి చిన్న అంశాలే ఇమేజ్ ను, కెరీర్ ను పెద్దగా డ్యామేజ్ చేస్తాయి. యాటిట్యూడ్ అనేది మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలి. ఆ ప్రతిబింబం ఎలా ఉంటే అలాగే సమాజానికీ అర్థం అవుతుంది. అద్దం వెనక అర్థాలెన్ని ఉన్నా.. కనిపించేదే ఫైనల్ అవుతుంది తప్ప.. సాధారణ జనాలకు వారి మనసులు తెలిసే అవకాశం లేని చోట జాగ్రత్తగానే మసలు కోవాలి. లేదంటే ఇలాగే అవుతుంది.

Telugu 70mm

Recent Posts

పిడుగులా ఓటిటి లో ఊడిపడిన కృష్ణమ్మ

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

4 hours ago

‘పుష్ప 2’ని కలవరపెడుతున్న రెండు విషయాలు

రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…

4 hours ago

‘మిరాయ్’ ప్రపంచంలోకి మంచు మనోజ్

'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…

5 hours ago

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్స్ రెడీ అవుతున్నాయి..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…

5 hours ago

నలభై రోజుల పాటు ఏకధాటిగా ‘విశ్వంభర’

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…

10 hours ago

Vijay ‘Goat’ completed VFX work

Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…

11 hours ago