రామ్, బోయపాటి.. జానర్ ఏంటీ..?

కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాయి. వైవిధ్యమైన కాంబోస్ గా చెప్పుకున్నా.. వారి ఇమేజ్ లు మాత్రం తేడా కొడుతుంటాయి. చాలా తక్కువ సందర్భాల్లోనే ఇమేజ్ లనూ నిలబెట్టుకుని బాక్సాఫీస్ ను గెలుస్తారు. అలా గెలుస్తారా లేదా అనేది అప్పుడే చెప్పలేం కానీ.. బాక్సాఫీస్ ను షేక్ చేసిన టైమ్ నుంచి అప్పుడప్పుడూ హిట్స్ కొట్టే హీరో వరకూ వచ్చాడు బోయపాటి శ్రీను. బోయపాటి కొత్త కథ చెప్పబోతున్నాడా లేక వేరే స్టార్ ఆప్షన్ లేక ఇలా స్మాల్ స్టార్ తో రెడీ అయ్యాడా అంటే ఖచ్చితంగా మొదటిదే అయ్యుంటుంది అని అనుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ అతను రామ్ కంటే సబ్ జూనియర్ బెల్లంకొండ శ్రీనుతో జయజానకి నాయక సినిమా చేశాడు కాబట్టి. అయితే రామ్ ఎనర్జిటిక్ హీరో కావొచ్చు. కానీ మాస్ హీరో కాదు.

బోయపాటికి మాస్ సినిమాలు తప్ప మరోటి చేతకాదు అని ఇన్నేళ్ల అతని కెరీర్ చూస్తే తెలుస్తుంది. వెంకటేష్ లాంటి హీరోను కూడా తులసి అంటూ సూట్ కాని పాత్రలో సెట్ చేసిన చరిత్ర అతనిది. అందుకే రామ్ తో బోయపాటి సినిమా అన్నప్పుడు చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కాంబో ఎలా కలిసింది.. అసలు వీరి ఇమేజ్ ల్లో ఎవరి ఇమేజ్ ఈ సినిమాతో హైలెట్ కాబోతోంది అంటూ రకరకాల ప్రశ్నలు కూడా వేసుకున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం సినిమా చెబుతుంది. కానీ చిన్న క్యూరియాసిటీ కొద్దీ చూస్తే నిజంగా ఈ కాంబినేషన్ విజయవంతం అవుతుందా అనిపిస్తుంది కూడా.

రామ్ కెరీర్ ఎప్పుడూ నిలకడగా లేదు. చాలా ఫ్లాపులు, యావరేజ్ ల తర్వాత వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇది అతనికి మొదటి 50కోట్ల సినిమా. కెరీర్ ఆరంభించిన పదిహేనేళ్ల వరకూ అతను ఈ మార్క్ ను చేరలేకపోయాడు. ఆ తర్వాత రెడ్ మళ్లీ విజయానికి రెడ్ సిగ్నల్ వేసింది. ఇప్పుడు తమిళ్ లో ఎవరూ పట్టించుకోని ఒకప్పటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లింగుస్వామితో ‘ద వారియర్’అనే సినిమాతో వస్తున్నాడు. ఫస్ట్ టైమ్ పోలీస్ గా నటించాడీ సినిమాలో. కానీ ఈ పాత్రే అతనికి సెట్ అవుతుందా అనుకునేవారూ ఉణ్నారు. అటు లింగుస్వామి మ్యాజిక్ వర్కవుట్ అయ్యేనా అనే డౌట్సూ ఉన్నాయి.

వారియర్ చివరికి వచ్చింది. దీంతో ఆల్రెడీ అనౌన్స్ అయిన బోయపాటి సినిమా స్టార్ట్ అయింది. బోయపాటి రేంజ్ లో ఫైట్స్ చేయాలంటే తన ఫిజిక్ కానీ.. పర్సనాలిటీ కానీ, ఇమేజ్ కానీ రామ్ కు పూర్తిగా అడ్డుగా నిలుస్తాయి. ఊరమాస్ ఫైట్స్ లేని బోయపాటి సినిమాను ఊహించలేం. అతనూ చేయలేడు. అందుకే జానర్ ఏదైనా బోయపాటి మార్క్ లోకే రామ్ ఎంటర్ కావాల్సి ఉంటుంది. అది కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అయితే ఖచ్చితంగా రామ్ రాంగ్ జానర్ లోకి ఎంటర్ అయినట్టే అనుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ కొత్త కాంబినేషన్ కు శుభకాంక్షలు చెబుదాం.

Related Posts