ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఓ సినిమా వస్తోందంటే ఫ్యాన్స్ లో ఎంత జోష్ ఉంటుందో తెలుసు కదా.. పైగా ఈ మధ్య వరుస మూవీస్ తో ఓ రేంజ్ లో దూకుడు చూపిస్తున్నాడు. రీసెంట్ గా భీమ్లా నాయక్ తో డీసెంట్ హిట్ కొట్టిన పవర్ కళ్యాణ్ ఇప్పుడు క్రిష్ డైరెక్షన్ లో హరిహరవీరమల్లు సినిమా చేస్తున్నాడు. తర్వాత హరీశ్ శంకర్ తో అనుకుంటే.. అనూహ్యంగా సరికొత్త సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈ కొత్త సినిమా జూన్ నుంచి స్టార్ట్ అవుతోంది.. కొన్నాళ్ల క్రితం వరుసగా సినిమాలు అనౌన్స్ చేశాడు పవన్ కళ్యాణ్. తన కెరీర్లో ఇన్ని సినిమాలను ఒకేసారి ప్రకటించడం ఇదే ఫస్ట్ టైమ్. పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు. వచ్చే ఎన్నికల నాటికి వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనే ఇలా చేశాడు అనుకున్నారు. అయితే ముందుగా అనుకున్న ప్లానింగ్స్ మారాయి. వకీల్ సాబ్ తర్వాత చాలామంది క్రిష్ సినిమా లేదంటే హరీశ్ శంకర్ ప్రాజెక్ట్ వస్తుంది అనుకున్నారు. అనూహ్యంగా మళయాల అయ్యప్పనుమ్ కోషియమ్ ను భీమ్లా నాయక్ గా రీమేక్ చేశాడు. ఈ యేడాది విడుదలైన ఈ మూవీ మంచి హిట్ గా నిలిచింది. అయితే పవన్ ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేసిన రోరింగ్స్ పెద్దగా కనిపించలేదు అన్నారు.

రాబిన్ హుడ్ తరహా పాత్రలో హరిహరవీరమల్లుగా క్రిష్ డైరెక్షన్ లో సినిమాకు కమిట్ అయ్యాడు. ఏఎమ్ రత్నం నిర్మిస్తోన్న ఈ చిత్రంపైనా అంచనాలున్నాయి. కానీ షూటింగ్ మాత్రం సజావుగా సాగడం లేదు. అనుకున్న టైమ్ కు పూర్తయ్యేలా లేదు. దీంతో హరీశ్ శంకర్ కు చాన్స్ ఉండొచ్చు అనుకున్నారు. అటు హరీష్ కూడా ఎప్పుడెప్పుడు సెట్స్ లో అడుగుపెట్టాలా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నాడు. బట్ అతనికీ ఛాన్స్ ఇవ్వలేదు. మరోసారి రీమేక్ తో రాబోతున్నాడు. దీంతో ఈ దర్శక నిర్మాతలతో పాటు అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

తమిళ్ లో హిట్ అయినా వినోదాయ సీతమ్ మూవీ రీమేక్ లో నటించబోతున్నాడు పవన్. ఈ మూవీని తమిళ్ లో నటుడు సముద్రఖని డైరెక్ట్ చేశాడు. దీంతో తెలుగు వెర్షన్ కూడ అతనికే ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఆ మధ్య ఈ రీమేక్ కు సంబంధించిన వార్తలు వచ్చినా అవన్నీ రూమర్స్ అనుకున్నారు. బట్.. హరీష్ శంకర్ సినిమాకంటే ముందు ఇదే సెట్స్ పైకి వెళుతోంది. జూన్ ఫస్ట్ వీక్ లో ఓపెనింగ్ జరుపుకుని రెగ్యులర్ షూట్ కు వెళ్లబోతోన్న ఈచిత్రంలో పవన్ తో పాటు అతని మేనల్లుడు సాయితేజ్ కూడా నటిస్తున్నాడు. పవన్ తో పాటు సమానమైన పాత్రనే సాయితేజ్ చేయబోతున్నాడట. విశేషం ఏంటంటే.. ఈ మూవీలో వపన్ ఇమేజ్ కు తగ్గ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. అయినా రీమేక్ చేస్తున్నాడంటే కథ నచ్చడం వల్లే అనుకోవచ్చు.

, , , , , ,